IPL 2022: మెరిసిన రాజస్థాన్‌, చతికిల పడిన బెంగుళూరు, 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైన రాయల్ ఛాలెంజర్స్

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది.

Rajasthan Royals all-rounder Riyan Parag (file image)

గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ దెబ్బకు సీజన్‌లోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైన బెంగళూరు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. బౌలర్లు రాణించి ప్రత్యర్థిని కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 29 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయంతో రన్‌రేట్‌ మెరుగు పర్చుకున్న రాజస్థాన్‌.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 నాటౌట్‌) పోరాడాడు. తాజా సీజన్‌లో మూడు సెంచరీలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న బట్లర్‌.. ఈసారి 8 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. దేవదత్‌ పడిక్కల్‌ (7) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (9 బంతుల్లో 17; 4 ఫోర్లు) ఎడాపెడా ఫోర్లు బాదగా.. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (27) మూడు సిక్సర్లు కొట్టినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. సిరాజ్‌, హాజెల్‌వుడ్‌, హసరంగలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అవతారమెత్తిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (9) మరోసారి నిరాశ పర్చగా.. డుప్లెసిస్‌ (23), రజత్‌ పాటిదార్‌ (16) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

బోల్తాపడిన చెన్నై, నాలుగో విజయాన్ని నమోదు చేసిన పంజాబ్, కీలక ఇన్నింగ్స్‌తో కింగ్స్‌కు విజయాన్ని అందించిన శిఖర్‌ ధవన్‌

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగితే.. ప్రభుదేశాయ్‌ (2) ప్రభావం చూపలేకపోయాడు. షాబాజ్‌ అహ్మద్‌ (17) తప్పిదానికి దినేశ్‌ కార్తీక్‌ (6) రనౌట్‌గా వెనుదిరగడంతో బెంగళూరు ఆశలు వదిలేసుకుంది. రాజస్థాన్‌ బౌలర్లలో కుల్దీప్‌సేన్‌ 4, అశ్విన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. పరాగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం గుజరాత్‌తో హైదరాబాద్‌ తలపడనుంది.