Maha Kumbh Mela 2025: వీడియోలు ఇవిగో,  ఈ సారి RCB కప్ కొట్టాలని మహాకుంభమేళాలో పూజలు చేసిన అభిమాని, గతంలో శబరిమలకు నడిచి వెళ్లిన మరో అభిమాని

RCB జట్టు IPL ట్రోఫీని గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ జట్టుకు ఎంతో లాయల్ అభిమానులుండగా ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు

RCB Fan in Maha Kumbh Mela (Photo Credits: the_nagendra_gupta/Instagram)

RCB జట్టు IPL ట్రోఫీని గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ జట్టుకు ఎంతో లాయల్ అభిమానులుండగా ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు. ఈక్రమంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే 'మహా కుంభమేళా'లో జెర్సీని ముంచి కోరుకుంటేనైనా గెలుస్తుందేమోనని ఓ అభిమాని భావించాడు.

కాగా ఈసారి ఆర్సిబి ఎలాగైనా కొట్టాలని ఓ తెలుగు వ్యక్తి అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేసిన వీడియో గతంలో వైరల్ గా మారింది. పాదయాత్రగా శబరిమల వెళుతూ దారి వెంట ఉన్న అన్ని దేవుళ్లకు మొక్కుతూ వెళుతున్నాడు. 2025 ఐపీఎల్ లో ఆర్సిబి ఛాంపియన్ అవ్వాలని శబరిమల యాత్ర చేస్తున్నానని చెబుతున్న పటాస్ ప్రశీత్ అనే ఈ ఆర్సిబి డై హార్డ్ ఫ్యాన్ వీడియోపై నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్లు ఇంకా పెడుతున్నారు.

కోహ్లీ ఉన్నా టైటిల్ కొట్టలేదు, ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పూర్తి జట్టు ఇదిగో, టైటిల్ రేసులో ఇప్పుడైనా నిలబడుతుందా..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మూడుసార్లు ఫైనల్ చేరింది. అలాగే మరో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. కాని కప్ మాత్రం అందని ద్రాక్షలానే మారింది. గత ఐదు సీజన్లలో ఆర్సిబి 4 సార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో ఆరో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఆర్సిబి జట్టుకు 9 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 2021 ఐపిఎల్ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.2022 ఐపీఎల్ సీజన్ నుండి ఫాఫ్ డూప్లెససిస్ ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

Fan Spotted Dipping RCB Jersey During Maha Kumbh Mela 2025

 

View this post on Instagram

 

A post shared by Nagendra Gupta (@the_nagendra_gupta)

RCB-fan-sabarimala-yatra-to-win-rcb-cup-in-ipl-2025

 

View this post on Instagram

 

A post shared by Kongarla prasheeth kumar (@pataas_prasheeth)

ఇక 2025 సీజన్ కి సంబంధించి ఆర్సిబి ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకుండా.. యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపింది. భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజిల్ వుడ్ వంటి కీలక ప్లేయర్లను ఆర్ సి బి ఈ సీజన్ లో దక్కించుకుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సిబి.. 2025 మెగా వేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టింది. ఇందులో యువ ఆటగాళ్లకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక

Who is Monalisa Bhosle: వీడియోలు ఇవిగో, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న మోనాలిసా భోంస్లే ఎవరు ? మహా కుంభమేళాలో ఎందుకంత పాపులర్ అయింది..

Maha Kumbh Mela 2025: వీడియోలు ఇవిగో,  ఈ సారి RCB కప్ కొట్టాలని మహాకుంభమేళాలో పూజలు చేసిన అభిమాని, గతంలో శబరిమలకు నడిచి వెళ్లిన మరో అభిమాని

Donald Trump Swearing In: వైట్‌హౌస్‌లోకి రీ ఎంట్రీ, అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం, భారత్ నుంచి కార్యక్రమానికి హాజరైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

Share Now