IPL Auction 2025 Live

IPL 2022: కోల్‌కతాను చిత్తు చేసిన చాహర్, ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, మెరుపులు మెరిపించిన బట్లర్‌

తొలుత బట్లర్‌ (61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103) సెంచరీతో కదం తొక్కగా..ఆపై స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగిన వేళ సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఏడు పరుగులతో కోల్‌కతాను చిత్తు (Rajasthan To Close Win) చేసింది.

Jos Buttler (left) and Yuzvendra Chahal (right) (Photo credit: Twitter)

ఆఖరి ఓవర్‌ వరకూ మజా పంచిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి అయింది. తొలుత బట్లర్‌ (61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103) సెంచరీతో కదం తొక్కగా..ఆపై స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగిన వేళ సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఏడు పరుగులతో కోల్‌కతాను చిత్తు (Rajasthan To Close Win) చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 217/5 స్కోరు చేసింది. శాంసన్‌ (38), హెట్‌మయెర్‌ (26) సత్తా చాటారు. నరైన్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం 218 ప‌రుగుల భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తా ఓ ద‌శ‌లో గెలుపు దిశ‌గా వెళ్లింది. కోహ్లీ బ్యాటింగ్‌పై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు, సాధారణ ప్లేయర్‌గా ఫీలవ్వాలని సూచన, నువ్వు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదని తెలిపిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్

అయితే 17వ ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ చాహ‌ల్ మ్యాచ్‌ను మ‌లుపు తిప్పేశాడు. ఆ ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ (Yuzvendra Chahal's Hat-Trick) తీసిన చాహ‌ల్ మొత్తం త‌న ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. ఆ ఓవ‌ర్ తొలి బంతికి వెంకటేశ్‌ అయ్యర్‌ (6) స్టంపౌట్‌ కాగా.. నాలుగో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదో బంతికి శివమ్‌ మావి (0) భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో క్యాచ్‌ ఔట్‌ కాగా.. ఆఖరి బంతికి కమిన్స్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్న చాహల్‌.. కోల్‌కతాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఏడు ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా ఓట‌మి పాలైంది.