IPL Auction 2025 Live

ICC T20 World Cup 2022: ఎప్పటిలాగే ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం, డికాక్‌ చేసిన పొరపాటుతో ప్రత్యర్థికి 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి

ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది.

South Africa penalized five runs after Quinton de Kock's trivial error

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా దక్షిణాఫ్రికా- జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. ప్రోటీస్‌ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రత్యర్ధి జట్టుకు 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి కూడా లభించింది.

లీగ్‌ దశలోనే పాకిస్తాన్ ఇంటికి, సెమీ ఫైనల్‌లో తలపడేది టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ జోస్యం

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వేతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అయితే నోకియా వేసిన అఖరి ఓవర్‌ రెండో బంతిని బ్యాటర్‌ మిల్టన్ శుంబా థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఆడాడు. అయితే థర్డ్‌ మ్యాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లుంగీ ఎంగిడీ.. వికెట్‌ కీపర్‌ వైపు త్రో విసిరాడు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ఈ క్రమంలో మైదానంలో ఉంచిన క్వింటన్ డి కాక్ గ్లోవ్‌లను బంతి తాకింది. దీంతో అంపైర్‌లు ఐదు పెనాల్టీ పరుగులతో పాటు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు.ఎంసీసీ నిబంధనల ప్రకారం.. మైదానంలో బంతి వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌కు గానీ, గ్లౌవ్‌లకు గానీ తాకితే అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇస్తారు. అదే విధంగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా అంపైర్‌లు ప్రకటిస్తారు.