Sanju Samson: టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలా కష్టం, సంచలన వ్యాఖ్యలు చేసిన కీపర్ సంజూ శాంసన్

41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

Sanju Samson (Photo credit: Twitter)

కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ శాంసన్ వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో బ్యాట్‌ ఝులిపించాడు. 41 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా తరఫున వన్డే కెరీర్‌లో మూడో అర్ధ శతకం నమోదు చేశాడు.మూడో వన్డేలో 200 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం మ్యాచ్‌ బ్రాడ్‌కాస్టర్స్‌తో మాట్లాడిన సంజూ శాంసన్‌.. భారత క్రికెటర్‌గా కొనసాగటం నిరంతరం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. మిడిలార్డర్‌లో ఆడటం బాగుంది. పరుగులు సాధించడం అంటే జట్టు గెలవడంలో మన వంతు పాత్ర పోషించడమే! ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో నాకంటూ భిన్న ప్రణాళికలు ఉంటాయి’’ అని సంజూ శాంసన్‌ చెప్పుకొచ్చాడు. కాగా 2015లో జింబాబ్వేతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా సంజూ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు

మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, 2-1 తేడాతో వన్డే సిరీస్ భారత్ కైవసం

ఇక తరచుగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ కేరళ బ్యాటర్‌ ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చాడు.టీమిండియా క్రికెటర్‌గా ఉండటం సవాలుతో కూడుకున్నది. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాను.. 8-9 ఏళ్లుగా భారత జట్టుకు కూడా ఆడుతున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఒక స్థానమంటూ లేదు. కాబట్టి ఏ పొజిషన్‌లో ఆడాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలన్న విషయం మనకు బోధపడుతుంది. మనం ఎన్ని ఓవర్ల పాటు క్రీజులో ఉన్నామన్నదే ముఖ్యం. అంతేగానీ బ్యాటింగ్‌ పొజిషన్‌ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ ఆడమన్నా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి’’ అని టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అన్నాడు.

కాగా కేరళకు చెందిన 28 ఏళ్ల సంజూ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. అయితే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో అతడికి మొండిచేయి ఎదురైంది. వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టింది.దీంతో మరోసారి బీసీసీఐ మరోసారి విరుచుకుపడ్డారు సంజూ ఫ్యాన్స్‌. ఈ క్రమంలో రెండో వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వారి ఆశలను వమ్ము చేశాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. తాజాగా మూడో వన్డేలో కీలక ఇన్సింగ్ ఆడాడు.