Soumya Sarkar: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్, న్యూజిలాండ్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సౌమ్య
ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు
Soumya Sarkar Breaks Sachin Tendulkar’s Record: నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్‌గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్‌తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్‌బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.