IPL-17 Final: ఐపీఎల్ టోర్నీలో అత్యల్ప స్కోరు, అత్యధిక రన్స్ సాధించిన జట్టుగా సన్ రైజర్స్, ఫైనల్ లో అత్యంత చెత్త రికార్డు సాధించిన హైదరాబాద్
మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో కాడి ఎత్తేశారు.
Chennai, May 26: పదిహేడో సీజన్‌లో రికార్డులు బద్దలు కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) టైటిల్ పోరులో చెత్తాటతో నిరాశపరిచింది. మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో కాడి ఎత్తేశారు.దాంతో, చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బౌలర్లకు బదులివ్వలేక కమిన్స్ సేన 113 పరుగులకే ఆలౌటయ్యింది. తద్వారా, ఐపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డు మూటగట్టుకుంది. దాంతో, 2013లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) పేరిట 125 పరుగులతో ఉన్న రికార్డు బద్దలైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌తో రికార్డు (Lowest Score) నెలకొల్పిన సన్‌రైజర్స్ ఫైనల్లో లో స్కోర్ కొట్టిన జట్టుగా నిలిచింది. దాంతో, ఈ మెగా టోర్నీలో రెండు రికార్డులను సన్‌రైజర్స్ తన ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ ఫైనల్లో తక్కువ స్కోర్ కొట్టిన మూడో జట్టు రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్. 2017లో ఆర్పీఎస్ టీమ్ ముంబైపై 6 వికెట్ల నష్టానికి 128 రన్స్ చేసిందంతే. ముంబై ఇండియన్స్(Mumbai Indians) 129 పరుగులతో నాలుగో స్థానం దక్కించుకోగా.. రాజస్థౄన్ రాయల్స్ జట్టు 130 రన్స్‌తో టాప్-5లో నిలిచింది.