SRH vs DC IPL 2021: ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ నమోదు, ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీదే పై చేయి, హైదరాబాద్‌ను గెలిపించలేకపోయిన విలియమ్సన్‌ బ్యాటింగ్, పృథ్వీ షాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆసక్తికరంగా సాగిన పోరులో (SRH vs DC IPL 2021 Stat Highlights) చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి (Delhi Capitals Beat Sunrisers Hyderabad in Super Over) విజయాన్నందుకుంది.

Prithvi Shaw and Shikhar Dhawan (Photo Credits: Twitter/@DelhiCapitals)

ఐపీఎల్‌–2021 సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆసక్తికరంగా సాగిన పోరులో (SRH vs DC IPL 2021 Stat Highlights) చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్, ఢిల్లీ స్కోర్లు ‘టై’ కావడంతో చివరకు ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. ఈ ఓవర్లో ముందుగా రైజర్స్‌ 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి (Delhi Capitals Beat Sunrisers Hyderabad in Super Over) విజయాన్నందుకుంది.

160 పరుగుల ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 53), పంత్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 37), స్మిత్‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 34 నాటౌట్‌) రాణించారు. పృథ్వీ షాకు (Prithvi Shaw) ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

టాస్‌ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకోగా పృథ్వీ షా ఓ ఊపు ఊపి వెంటనే అవుటయ్యాడు. హైదరాబాద్‌ స్పిన్నర్లు రషీద్‌, సుచిత్‌ పరుగులను నియంత్రించారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్లోనే కళాత్మక హ్యాట్రిక్‌ ఫోర్లతో జోరు ప్రదర్శించిన పృథ్వీ షా..అభిషేక్‌ వేసిన రెండో ఓవర్లో ఇంకో బౌండ్రీ బాదాడు. అదే ఊపులో కౌల్‌ బంతిని అద్భుత సిక్సర్‌గా మ లచడంతో ఢిల్లీ స్కోరుబోర్డు దూసుకుపోయింది. దాంతో పవర్‌ప్లేలో ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 51 రన్స్‌తో నిలిచింది.

పసలేని మ్యాచ్.. నాలుగో ఓటమితో కష్టాల్లో కోల్‌కతా, గెలుపు బాట పట్టిన రాజస్థాన్ రాయల్స్, 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై అలవోక విజయాన్ని సాధించిన ఆర్ఆర్, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోరిస్‌

మరోవైపు ధవన్‌కూడా ఆడపాదడపా ఫోర్లు సంధించగా...రషీద్‌ మొదటి ఓవర్లో చక్కటి బౌండ్రీ కొట్టిన షా..ఆపై హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే తన రెండో ఓవర్లో ధవన్‌ (28)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన రషీద్‌..హైదరాబాద్‌కు కీలక బ్రేక్‌ ఇచ్చాడు. దాంతో 81 పరుగుల మొదటి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే షా రనౌట్‌ కావడంతో ఢిల్లీకి డబుల్‌ షాక్‌ తగిలింది. అనంతరం కెప్టెన్‌ పంత్‌, స్మిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా..19వ ఓవర్లో పంత్‌, హెట్‌మయెర్‌ను సిద్దార్థ్‌ కౌల్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆఖరి ఓవర్లో స్మిత్‌ ఒకింత ధాటిగా ఆడి 4,6 కొట్టడంతో ఢిల్లీ 14 పరుగులు రాబట్టగలిగింది

చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో పృథ్వీ షా 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పంత్‌ 37, స్మిత్‌ 34 నాటౌట్‌ రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగులు చేసిన వార్నర్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. 56 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 బంతుల్లోనే 38 పరుగులతో ధాటిగా ఆడుతున్న బెయిర్‌ స్టో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌‌( 50 బంతుల్లో 65 పరుగులు, 8 ఫోర్లు) క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడి చివరివరకు నిలిచి మ్యాచ్‌ను టై కావడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఇక చివర్లో జగదీష్‌ సుచిత్‌ 4 బంతుల్లోనే 14 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3, అక్షర్‌ పటేల్‌ 2, అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ తీశాడు.

స్కోరు బోర్డు, ఢిల్లీ: పృథ్వీ షా (రనౌట్‌) 53; ధవన్‌ (బి) రషీద్‌ 28; రిషభ్‌ పంత్‌ (సి) సుచిత్‌ (బి) కౌల్‌ 37; స్మిత్‌ (నాటౌట్‌) 34; హెట్‌మయెర్‌ (సి) విలియమ్సన్‌ (బి) కౌల్‌ 1; స్టొయినిస్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 159/4; వికెట్ల పతనం: 1-81, 2-84, 3-142, 4-145; బౌలింగ్‌: ఖలీల్‌ 4-0-42-0; అభిషేక్‌ 1-0-14-0; సిద్దార్ధ్‌ కౌల్‌ 4-0-31-2; సుచిత్‌ 4-0-21-0; విజయ్‌ శంకర్‌ 3-0-19-0; రషీద్‌ 4-0-31-1.

హైదరాబాద్‌: వార్నర్‌ (రనౌట్‌) 6; బెయిర్‌స్టో (సి) ధవన్‌ (బి) అవేశ్‌ 38; విలియమ్సన్‌ (నాటౌట్‌) 66; విరాట్‌ సింగ్‌ (సి) స్టొయినిస్‌ (బి) అవేశ్‌ 4; జాదవ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) మిశ్రా 9; అభిషేక్‌ (ఎల్బీ) అక్షర్‌ 5; రషీద్‌ (ఎల్బీ) అక్షర్‌ 0; విజయ్‌ శంకర్‌ (బి) అవేశ్‌ 8; సుచిత్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 159/7; వికెట్ల పతనం: 1-28, 2-56, 3-84, 4-104, 5-117, 6-117, 7-136; బౌలింగ్‌: రబాడ 3-0-26-0; అశ్విన్‌ 4-0-27-0; స్టొయినిస్‌ 1-0-12-0; అక్షర్‌ 4-0-26-2; అవేశ్‌ 4-0-34-3; మిశ్రా 4-0-31-1.

సూపర్ ఓవర్ ఎలా సాగిందంటే..

సన్ రైజర్స్ బ్యాటింగ్:

బాల్ 1: అక్షర్ x వార్నర్ - నో రన్

బాల్ 2: అక్షర్ x వార్నర్ - 1 రన్

బాల్ 3: అక్షర్ x విలియమ్సన్ - ఫోర్

బాల్ 4: అక్షర్ x విలియమ్సన్ - నో రన్

బాల్ 5: అక్షర్ x విలియమ్సన్ - 1 లెగ్ బై

బాల్ 6: అక్షర్ x విలియమ్సన్ - 1 రన్

ఢిల్లీ బ్యాటింగ్:

బాల్ 1: రషీద్ ఖాన్ x పంత్ - 1 రన్

బాల్ 2: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై

బాల్ 3: రషీద్ ఖాన్ x పంత్ - ఫోర్

బాల్ 4: రషీద్ ఖాన్ x పంత్ - నో రన్

బాల్ 5: రషీద్ ఖాన్ x పంత్ - 1 లెగ్ బై

బాల్ 6: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై