Chris Morris (Photo Credits: Twitter/@IPL)

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో (Rajasthan Royals vs Kolkata Knight Riders) రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం సాధించింది. క్రిస్‌ మోరిస్‌ కట్టుదిట్టమైన బంతులకు కేకేఆర్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. రెండు పరాజయాల అనంతరం రాజస్థాన్‌ తిరిగి గెలుపు బాట పట్టగా.. కోల్‌కతా ఈ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. కోలకతాతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో (RR vs KKR, IPL 2021 Stat Highlights) ఆర్‌ఆర్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్‌ త్రిపాఠి (26 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 36) ఒక్కడే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 134 పరుగులు చేసి నెగ్గింది. మిల్లర్‌ (23 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్‌) సహకరించాడు. వరుణ్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మోరిస్‌ నిలిచాడు.

టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ జట్టు కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్ లో కేకేఆర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి 32 బంతుల్లో 21 డాట్‌ బంతులుండగా.. పవర్‌ప్లేలో 25 పరుగులే చేసింది . దీనికి తోడు ఓపెనర్‌ గిల్‌ (11)ను బట్లర్‌ డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. మరుసటి ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి ఫోర్‌, ఓపెనర్‌ రాణా (22) ఓ సిక్సర్‌ సాధించాడు. అయితే ఈ జోరు ఎక్కువ సేపు కొనసాగకుండా మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. సకారియా ఓవర్‌లో కీపర్‌ శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి రాణా అవుటయ్యాడు. ఆ వెంటనే నరైన్‌ (6) క్యాచ్‌ను లాంగ్‌ లెగ్‌లో జైశ్వాల్‌ డైవ్‌ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. ఇక 11వ ఓవర్‌లో కెప్టెన్‌ మోర్గాన్‌ (0) అసలు బంతులెదుర్కోకుండానే సమన్వయ లోపంతో రనౌట్‌ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో దినేశ్‌ కార్తీక్‌తో కలిసి త్రిపాఠి వేగంగా ఆడే ప్రయ్నతం చేశాడు.

ముంబైకు ముచ్చటగా మూడో ఓటమి, మళ్లీ గెలుపు బాట పట్టిన పంజాబ్, 9 వికెట్లతో ఘనవిజయం ముంబై ఇండియన్స్‌పై సాధించిన పంజాబ్ కింగ్స్

చక్కగా కుదురుకున్న త్రిపాఠిని 16వ ఓవర్‌లో ముస్తాఫిజుర్‌ స్లో ఆఫ్‌ కట్టర్‌తో అవుట్‌ చేశాడు. ఈ ఆటతీరుతో 17వ ఓవర్‌లో కానీ స్కోరు వంద పరుగులకు చేరలేకపోయింది. 18వ ఓవర్‌లో రస్సెల్‌ (9), కార్తీక్‌ (25)ను మూడు బంతుల తేడాతో మోరిస్‌ దెబ్బతీయడం జట్టు స్కోరుపై ప్రభావం పడింది. ఇక ఆఖరి ఓవర్‌లో కమిన్స్‌ (10) సిక్సర్‌ మినహా మరో పరుగు రాలేదు. కమిన్స్‌తో పాటు శివమ్‌ మావి (5) వికెట్‌ను కూడా మోరిస్‌ తీయడంతో నైట్‌రైడర్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

లక్ష్యం తక్కువగా ఉండటంతో, రాజస్థాన్ రాయల్స్ నిదానంగా తన ఆటను ప్రారంభించింది. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో బట్లర్ అవుట్ కాగా, ఆపై వన్ డౌన్ లో వచ్చిన సంజూ, యశస్వి జైస్వాల్ తో కలిసి స్కోరును ముందుకు దూకించాడు. 10 ఓవర్లు ముగిసేవరకు 2 వికెట్లను కోల్పోయిన ఆర్ఆర్, 80 పరుగులకు చేరుకున్న సమయంలోనే విజయం ఖరారైంది. ఆపై కోల్ కతా బౌలర్ వరుణ్ కొంత అడ్డుకున్నా, విజయాన్ని మాత్రం దూరం చేయలేకపోయాడు. సంజూకు జతకలిసిన డేవిడ్ మిల్లర్ జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యాన్ని చేరారు.

స్కోరు బోర్డు : కోల్‌కతా: నితీష్‌ (సి) శాంసన్‌ (బి) సకారియా 22; శుభ్‌మన్‌ (రనౌట్‌) 11; రాహుల్‌ (సి) పరాగ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 36; నరైన్‌ (సి) జైశ్వాల్‌ (బి) ఉనాద్కత్‌ 6; మోర్గాన్‌ (రనౌట్‌) 0; దినేష్‌ కార్తీక్‌ (సి) సకారియా (బి) మోరిస్‌ 25; రస్సెల్‌ (సి) మిల్లర్‌ (బి) మోరిస్‌ 9; కమిన్స్‌ (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 10; శివమ్‌ మావి (బి) మోరిస్‌ 5; ప్రసిద్ధ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 133/9; వికెట్ల పతనం: 1-24, 2-45, 3-54, 4-61, 5-94, 6-117, 7-118, 8-133, 9-133; బౌలింగ్‌: ఉనాడ్కత్‌ 4-0-25-1; సకారియా 4-0-31-1; ముస్తాఫిజుర్‌ 4-0-22-1; మోరిస్‌ 4-0-23-4; రాహుల్‌ తెవాటియా 3-0-24-0; శివమ్‌ దూబే 1-0-5-0.

రాజస్థాన్‌: బట్లర్‌ (ఎల్బీ) వరుణ్‌ 5; జైశ్వాల్‌ (సి) సబ్‌-నాగర్‌కోటి (బి) మావి 22; సంజూ శాంసన్‌ (నాటౌట్‌) 42; శివమ్‌ దూబే (సి) ప్రసిద్ధ్‌ (బి) వరుణ్‌ 22; తెవాటియా (సి) సబ్‌-నాగర్‌కోటి (బి) ప్రసిద్ధ్‌ 5; మిల్లర్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 18.5 ఓవర్లలో 134/4; వికెట్ల పతనం: 1-21, 2-40, 3-85, 4-100; బౌలింగ్‌: శివమ్‌ మావి 4-0-19-1; కమిన్స్‌ 3.5-0-36-0; చక్రవర్తి 4-0-32-2; నరైన్‌ 4-0-20-0; ప్రసిద్ధ్‌ 3-0-20-1.

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ ఢీ

రాత్రి గం.7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ నె,ర పా

బెంగళూరు 4 4 0 1.00 8

చెన్నై 4 3 1 1.14 6

ఢిల్లీ 4 3 1 0.42 6

ముంబై 5 2 3 -0.03 4

పంజాబ్‌ 5 2 3 -0.42 4

రాజస్థాన్‌ 5 2 3 -0.68 4

హైదరాబాద్‌ 4 1 3 -0.22 2

కోల్‌కతా 5 1 4 -0.67 2

ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్‌ రన్‌రేట్‌, పా-పాయింట్లు