T20 World Cup 2022: మహమ్మద్ షమీ కన్నా సిరాజ్ బెటర్, సంచలన వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్, బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు సిరాజ్ అని వెల్లడి
టీమిండియాలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ 2022 ఆరంభమవుతున్న సంగతి విదితమే. టీమిండియాలో ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో, స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ వైపే యాజమాన్యం మొగ్గుచూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే ఫిట్‌నెస్ నిరూపించుకున్న అతడు ఆస్ట్రేలియాకు పయనమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునిల్ గవాస్కర్.. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు సిరాజ్ (Sunil Gavaskar picks Siraj) అంటూ కామెంట్స్ చేశాడు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా నేను సిరాజ్‌నే (Bumrah’s replacement for T20 World Cup) ఎంచుకుంటాను. ఇప్పటివరకైతే బీసీసీఐ బుమ్రా రీప్లేస్‌మెంట్ ఎవరో ప్రకటించలేదు.
షమీ నాణ్యమైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. అతడు గత కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో కోలుకున్నాడని చెప్పలేం. టీ20 క్రికెట్‌లో నాలుగు ఓవర్ల కోటానే ఉంటుందని తెలుసు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు సిరాజ్ బెస్ట్ ఆప్షన్ అనిపిస్తోంది’’ అని గవాస్కర్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.