T20 WC 2021 AUS Vs SL: లంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా, వార్నర్ దూకుడుతో చేతులెత్తేసి శ్రీలంక
Australias win over Sri Lanka | టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన T20 లీగ్ మ్యాచులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 12 నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన T20 లీగ్ మ్యాచులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65), ఆరోన్ ఫించ్(37) రాణించగా ఆస్ట్రేలియా మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. లంక బౌలర్లలో హస్రంగా రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లంక బ్యాటింగ్‌లో కుషాల్ పెరీరా, చరిత్ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో లంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలా రెండు వికెట్లు తీశారు.
ఇదిలా ఉంటే 2010 టి20 ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడడం మళ్లీ ఇదే. ఇక ముఖాముఖి పోరులో టి20ల్లో 16 సార్లు తలపడగా.. 8 సార్లు ఆసీస్.. 8 సార్లు లంక విజయాలు అందుకుంది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా.. రెండుసార్లు ఆసీస్.. ఒకసారి లంక విజయం అందుకుంది.