Representational Image (Photo- Wikimedia Commons)

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్‌ స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ని ఓడించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేసింది. ఎందుకంటే గ్రూప్ 2 ప్రకారం.. ఈ రోజు న్యూజిలాండ్‌ని స్కాట్లాండ్ ఓడించడం చాలా ముఖ్యం. ఇది జరగలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 56 బంతులు ఎదుర్కొన్న గప్టిల్ 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడే. గ్లెన్ ఫిలిప్స్ 33 పరుగులు చేశాడు. అనంతరం 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లను స్కాట్లాండ్ బ్యాటర్లు దీటుగానే ఎదుర్కొన్నప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

స్కాట్లాండ్ బ్యాటర్ మైఖేల్ లీస్క్ 42 (నాటౌట్) పరుగులు చేయగా, జార్జ్ మున్సీ 22, మాథ్యూ క్రాస్ 27, రిచీ బెరింగ్టన్ 20 పరుగులు చేశారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన స్కాట్లాండ్‌కు ఇక ఇంటిముఖం పట్టినట్టే. వీరబాదుడతో 93 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.



సంబంధిత వార్తలు

T20 World Cup 2021, NZ vs AFG: భారత్ ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్గనిస్థాన్‌, సెమీఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌, టీమిండియాకు తప్పని ఇంటిదారి..

T20 WC 2021 Final AUS vs NZ: T20 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్‌లో కివీస్ చిత్తు, బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా రెచ్చిపోయిన వార్నర్, మార్ష్..

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన భారతీయ డాక్టర్, సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్..

T20 World Cup 2021: టీ-20 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా, దుమ్మురేపిన వేడ్, స్టోయినిస్, ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌తో అమీతుమీకి రెడీ

T20 World Cup: నమీబియాపై విజయంతో ఇంటి బాట పట్టిన టీమిండియా, టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, విజయంతో ముగిసిన కోహ్లీ శకం..

Kapil Dev: మన ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యం, అందుకే టీ20 ప్రపంచకప్ ఓటమి, తీవ్ర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్, ఐపీఎల్ ప్రాంచైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టవద్దని కోరిన మాజీ కెప్టెన్

T20 World Cup 2021: ఆప్గనిస్తాన్ మీదనే భారత్ సెమీస్ ఆశలు, ఆదివారం న్యూజిల్యాండ్- ఆప్గనిస్తాన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్

T20 World Cup 2021: ఆరు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, ఆరూన్ ఫించ్