T20 World Cup 2022: భారత జట్టులోకి మహమ్మద్ షమీని తీసుకోవడంపై రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు, అతని స్థితిపై నివేదికలను పొంది నిర్ణయిస్తామని వెల్లడి
అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్(T20 World Cup) టీమిండియా క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని(Mohammed Shami) తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టీ 20 ప్రపంచకప్(T20 World Cup) టీమిండియా క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని(Mohammed Shami) తీసుకుంటారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో, రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. బుమ్రా స్థానంలో ఇంకా ఎవరిని బీసీసీఐ ఎంపిక చేయలేదు.
ఈ నేపథ్యంలో భారత జట్టులో బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని తీసుకుంటారా అని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను(head coach Rahul Dravid) విలేకరులు అడిగారు.‘‘బుమ్రా స్థానంలో ఎవరు ఉంటారో, మేం చూస్తాం, మాకు అక్టోబర్ 15వతేదీ వరకు సమయం ఉంది. కాబట్టి షమీ స్పష్టంగా స్టాండ్‌బైలో ఉన్న వ్యక్తి.
14-15 రోజుల కోవిడ్ తర్వాత అతని స్థితి ఏమిటి అనే దాని గురించి మేం నివేదికలను పొంది నిర్ణయిస్తాం”అని మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ అన్నారు. కాగా జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను గాయంతో టీ20 ప్రపంచ కప్ నకు దూరమయ్యాడు. ప్రపంచకప్ కోసం బుమ్రా స్థానంలో షమి లేదా దీపక్ చాహర్‌లలో ఒకరు జట్టులోకి రానున్నారు.