Bangladesh Vs Afghanistan: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బంగ్లాదేశ్, ఆసియాకప్‌లో కీలక మ్యాచ్‌లో విజయం, భారీ లక్ష్యాన్ని చేధించలేక తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్
ఈరోజు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan)పై 89 పరుగుల తేడాతో గెలుపొందింది.
Lahore, SEP 03: ఆసియా కప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) ఆల్‌రౌండ్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈరోజు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan)పై 89 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టార్ పేసర్ తస్కిన్ అహ్మద్ 4 వికెట్లతో చెలరేగాడు. దాంతో, 335 పరుగుల భారీ ఛేదనలో అఫ్గన్ జట్టు 245 పరుగులకే కుప్పకూలింది. ధాటిగా ఆడుతున్న రషీద్ ఖాన్(24)ను తస్కిన్ చివరి వికెట్‌గా పెవిలియన్ పంపాడు. దాంతో, బంగ్లా శిబిరంలో సంబురాలు మొదలయ్యాయి.
భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్(75), కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(51) అర్ధ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్(Bangladesh) 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలకంపై చేతులెత్తేసిన బ్యాటర్లు అఫ్గనిస్థాన్‌పై చెలరేగారు.
ఓపెనర్‌గా వచ్చిన ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(112 : 119 బంతుల్లో 7 ఫోర్ల, మూడు సిక్స్‌లు), నజ్ముల్ హెసేన్ శాంటో(104 : 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో అఫ్గన్ బౌలర్లపైవిరుచుకుపడ్డారు. చివర్లో కెప్టెన్ షకిబుల్ హసన్(32: 18 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దంచాడు. దాంతో, బంగ్లా భారీ స్కోర్ చేసింది. అఫ్గన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుల్బదిన్ నయూబ్ చెరొక వికెట్ తీశారు.