IND vs AUS 3rd T20: జింఖానా ఘటనలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ వైఫల్యంపై పోలీసులు సీరియస్, హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశం

ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద హెచ్‌సీఏ (Hyderabad Cricket Association (HCA)ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది

Tension prevails at Gymkhana over ticket sale, six injured (Photo-Video Grab)

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌(HCA) ఘోర వైఫల్యంపై పోలీసులు సీరియస్‌గా అయ్యారు. ఆసీస్‌-భారత్‌ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద హెచ్‌సీఏ (Hyderabad Cricket Association (HCA)ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది. టికెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట (Tension prevails at Gymkhana) జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

ఈ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్‌ సీపీ చౌహాన్‌ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్‌ జోన్‌ అడిషనల్‌ సీపీ చౌహాన్‌ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు.

Here's Video

పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్‌లో లైన్‌లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్‌ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ ఇదిగో..

Bengal Women Creates History: మహిళల దేశవాళీ క్రికెట్‌ లో బెంగాల్ టీమ్ నయా చరిత్ర.. హర్యానాపై ఏకంగా 390 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బెంగాల్

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం