IPL 2020: బౌల్ట్‌ బౌలింగ్ దెబ్బ..వికెట్ రెండు ముక్కలైంది, ప్రాక్టీస్ సెషన్‌లో అదరరగొడుతున్న న్యూజీలాండ్ బౌలర్, లసిత్ మలింగ స్థానంలో ముంబై జట్టుకు ఎంపిక

ప్రాక్టీస్ సెషన్ లో బాల్ తో నిప్పులు చెరుగుతున్నాడు. లసిత్‌ మలింగ స్థానంలోకి ముంబై జట్టులో చేరిన ఈ ఫాస్ట్ బౌలర్ లసిత్‌ మలింగ లేని లోటును తీర్చేందుకు రెడీ అయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో (Mumbai Indians Training Session) వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్‌.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాడు.

Trent Boult (photo-Twitter/Mumbai Indians)

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (Trent Boult) ఐపీఎల్‌లో ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో బాల్ తో నిప్పులు చెరుగుతున్నాడు. లసిత్‌ మలింగ స్థానంలోకి ముంబై జట్టులో చేరిన ఈ ఫాస్ట్ బౌలర్ లసిత్‌ మలింగ లేని లోటును తీర్చేందుకు రెడీ అయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో (Mumbai Indians Training Session) వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్‌.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాడు.

ముంబై ప్రధాన కోచ్‌ మహేల జయవర్దనే ఆధ్వర్యంలో బౌల్ట్‌ తన బౌలింగ్‌ ప్రాక్టీస్‌ కొనసాగించాడు. బౌలింగ్‌ చేస్తున్నంత సేపు పదునైన లైన్‌ అండ్‌ లెంగ్త్ డెలివరీలు, యార్కర్లతో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే బౌల్ట్‌ సంధించిన ఒక డెలివరీ వేగంగా వెళ్లి మిడిల్‌ స్టంప్‌ వికెట్‌ను గిరాటేయగా.. అది రెండు ముక్కలైంది. తాజాగా బౌల్ట్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోనూ ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ' ట్రెంట్‌ వచ్చీ రాగానే.. వికెట్‌ క్లీన్‌ బౌల్ట్‌ అయింది ' అంటూ కామెంట్‌ చేసింది.

Here's Mumbai Indians Share Video

ఐపీఎల్‌ 13వ సీజన్‌కు (IPL 2020) వ్యక్తిగత కారణాలతో లసిత్‌ మలింగ దూరమవ్వడంతో జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి బౌల్ట్‌ బౌలింగ్‌ పంచుకోనున్నాడు. 2015లో మొదటిసారి ఐపీఎల్‌లో పాల్గొన్న బౌల్ట్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 5 కోట్లకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. 2018-19లో బౌల్ట్‌ 2.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేయగా.. డిసెంబర్‌ 2019లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ రూ. 3.2 కోట్లకు దక్కించుకుంది.



సంబంధిత వార్తలు

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్