Virat Kohli Press Conference: వ‌న్డేల‌కు కెప్టెన్‌గా కొన‌సాగ‌రాదని 5 గురు సెలెక్ట‌ర్లు నిర్ణయించారు, వ‌న్డేల‌కు తానేమీ రెస్ట్ కోర‌లేదు, మీడియాతో విరాట్ కోహ్లీ

ఇవాళ ఆయ‌న ముంబైలో మీడియాతో (Virat Kohli Press Conference) మాట్లాడుతూ..టెస్టు జట్టును ఎంపిక చేసుకోవ‌డానికి కేవ‌లం గంట‌న్న‌ర ముందు మాత్ర‌మే త‌న‌ను బీసీసీఐ కాంటాక్ట్ చేసిన‌ట్లు కోహ్లీ ( Virat Kohli) చెప్పాడు.

virat-kohli-1

ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు త‌నకు మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇవాళ ఆయ‌న ముంబైలో మీడియాతో (Virat Kohli Press Conference) మాట్లాడుతూ..టెస్టు జట్టును ఎంపిక చేసుకోవ‌డానికి కేవ‌లం గంట‌న్న‌ర ముందు మాత్ర‌మే త‌న‌ను బీసీసీఐ కాంటాక్ట్ చేసిన‌ట్లు కోహ్లీ ( Virat Kohli) చెప్పాడు. వ‌న్డే కెప్టెన్సీ నుంచి తొల‌గించే అంశంపై సెలెక్ట‌ర్లు కానీ, బీసీసీఐ కానీ త‌నతో సంప్ర‌దించిందా అని విలేకురులు అడిగిన ప్ర‌శ్న‌కు కోహ్లీ (Virat Kohli) బ‌దులు ఇచ్చాడు. టీ20 కెప్టెన్సీ వ‌దులుకునే ముందు తాను బీసీసీఐకి చెప్పాన‌ని, త‌న వ్యూహాల‌ను వారికి వెల్ల‌డించాన‌న్నారు. బీసీసీఐ దాన్ని స్వాగ‌తించిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. అయితే వ‌న్డేల‌కు, టెస్టుల‌కు కెప్టెన్‌గా కొన‌సాగేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు అప్ప‌ట్లో చెప్పిన‌ట్లు కోహ్లీ గుర్తు చేశాడు.

ఒక‌వేళ ఆఫీసు బియ‌ర‌ర్లు లేదా సెలెక్ట‌ర్లు త‌న‌కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డానికి అనుకూలంగా లేకున్నా.. దానికి కూడా తాను సిద్ధ‌మే అని చెప్పిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. తానెప్పుడూ సెలెక్ష‌న్‌కు అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పాడు. వ‌న్డేల‌కు అందుబాటులో ఉంటాన‌ని, ఆడేందుకు కూడా ఇష్టంగా ఉన్న‌ట్లు కోహ్లీ స్ప‌ష్టం చేశాడు. వ‌న్డేల‌కు కెప్టెన్‌గా కొన‌సాగ‌రాదు అని అయిదుగురు సెలెక్ట‌ర్లు నిర్ణ‌యించిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. సౌతాఫ్రికా టూర్‌లో జ‌రిగే వ‌న్డేల‌కు తానేమీ రెస్ట్ కోర‌లేద‌ని, త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాస్తున్నార‌ని కోహ్లీ అన్నాడు.

ద‌క్షిణాఫ్రికా టూర్ చేస్తున్న ఇండియాకు రెండు రోజుల క్రితం జ‌ట్ల‌ను ప్ర‌క‌టించారు. అయితే వ‌న్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ త‌ప్పించింది. ఈ నేప‌థ్యంలో రోహిత్‌, కోహ్లీ మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తున్న‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ ప‌లు అంశాల‌ను ట‌చ్ చేశాడు

నిన్న కోహ్లి తన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చాలా అంశాలకు సమాధానమిచ్చాడు. నేను సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలకు అందుబాటులో ఉంటా. నాకు విశ్రాంతి కావాలని నేనెప్పుడూ బీసీసీఐని కోరలేదు. మీడియాలో వచ్చే వార్తలు నమ్మదగినవి కావు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించామని మాత్రమే సెలక్టర్లు చెప్పారు. అంతేకానీ వన్డేలకు దూరంగా ఉంటున్నట్లు నేను ఎక్కడా ప్రకటించలేదు.ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడం ఆపండి. నా గురించి తప్పుడు వార్తలు రాసిన వారిని వెళ్లి అడగండి. వన్డేలకు సెలక్టర్లకు అందుబాటులో ఉంటా అని మరోసారి స్పష్టం చేస్తున్నా. కెప్టెన్సీ నుంచి తీసేసినంత మాత్రానా నాకు పెద్దగా నష్టమేమి ఉండదు.. ఒత్తిడి తగ్గి ఆటగాడిగా బాగా రాణించే అవకాశముంటుంది. రోహిత్‌ కెప్టెన్సీలో పనిచేయడం నాకు ఇష్టమే. మా మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న మాటలు అవాస్తవం. వన్డేలు ఆడడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నా. ఇలాంటి పుకార్లు పుట్టించి సమయం వృథా చేయొద్దు.

బీసీసీఐ నన్ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాత్రమే చెప్పింది. కానీ దీనిపై కనీసం నన్ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంది. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో గంగూలీ నన్ను సంప్రదించారన్న వార్తలను ఖండిస్తున్నా. టి20 కెప్టెన్సీ నుంచి నాకు నేనుగా పక్కకు తప్పుకున్నప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. వన్డే కెప్టెన్సీ తొలగింపుపై చివరి నిమిషంలో నాకు సమాచారమిచ్చారు. ఈ విషయంలో బీసీసీఐతో నాకు సరైన సంప్రదింపులు జరగలేదని మాత్రం చెప్పగలను.'' అని పేర్కొన్నాడు.