IND vs NZ 1st Test 2024: అయిదుగురు స్టార్ బ్యాటర్లు వరుసగా డకౌట్, రిషబ్ పంత్ ఆ 20 పరుగులు చేయకుండా ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా..
కోహ్లీ, సర్ఫరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అత్యధికంగా 20 పరుగులు చేయగా, అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లీ, సర్ఫరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గడ్డపై భారత్ జట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి తక్కువ పరుగులకు ఔట్ కావడం గమనార్హం. టెస్టుల్లో అతి తక్కువ పరుగులకు ఇండియా నిష్క్రమించడం ఇది మూడవసారి.
అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
Here's News