Virat Kohli Ducks Record: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ
ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ వేసిన ఓవర్‌లో తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీ20లలో కోహ్లీ 6వసారి డకౌట్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికాను ఓడించి టీమిండియా హ్యాట్రిక్ విజయాల నమోదు...7 వికెట్ల తేడాతో USAను ఓడించి సూపర్ 8కి అర్హత సాధించిన టీమిండియా
టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో గోల్డెన్ డకౌట్ అయిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, సురేశ్ రైనా వంటి ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ చేరాడు.
టీ20లలో ఎక్కువ సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్లు
1. రోహిత్ శర్మ - 12
2. విరాట్ కోహ్లీ - 6
3. కేఎల్ రాహుల్ - 5
ఇక టీ20 ప్రపంచకప్‌లలో గోల్డెన్ డక్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
1. దినేష్ కార్తీక్ -2007 (ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా)
2. మురళీ విజయ్ -2010 (ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా)
3. ఆశిష్ నెహ్రా -2010 (ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా)
4. సురేష్ రైనా -2016 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)
5. రోహిత్ శర్మ - 2021 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)
6. రవీంద్ర జడేజా -2024 (ఇండియా వర్సెస్ పాకిస్థాన్)
7. జస్ప్రీత్ బుమ్రా -2024 ((ఇండియా వర్సెస్ పాకిస్థాన్)
8. విరాట్ కోహ్లీ -2024 (ఇండియా వర్సెస్ అమెరికా)