Virat Kohli:తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న అనుష్క శర్మ సెలబ్రేషన్స్
నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. డచ్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం.
Bangalore, NOV 12: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat kohli) బ్యాట్‌తోనే కాదూ బంతితోనూ తన బౌలింగ్ స్కిల్స్‌ను (Virat Kohli Wicket) చూపించాడు. నెదర్లాండ్స్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. డచ్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం. కోహ్లీ వికెట్ తీయగానే స్టాండ్స్‌లో మ్యాచ్ చూస్తున్న విరాట్ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) పట్టరాని ఆనందంతో మురిసిపోయింది.
ప్రత్యర్ధి జట్టులో బ్యాటర్ ఎలా ఔట్ అయినా తనదైన దూకుడుతో సెలబ్రేషన్స్ చేసుకునే కోహ్లీ.. తన బౌలింగ్‌లోనే వికెట్ పడితే కామ్‌గా ఉంటాడా..? తనదైన శైలిలో సంబురాలు చేసుకున్నాడు. అదే సమయంలో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న తన భార్యను చూస్తూ ‘నేను సాధించా’ అన్నట్టుగా రెండు చేతుల పిడికిలి బిగించి వేడుకలు చేసుకున్నాడు. భర్తను చూసిన అనుష్క సైతం అతడిని మరింత ఉత్సాహపరుస్తూ ‘యెస్.. ఇది నీకే సొంతం’ అన్నట్టుగా సెలబ్రేట్ చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral Video) అవుతోంది. కాగా భారత్ నిర్దేశించిన 411 పరుగుల ఛేదనలో నెదర్లాండ్స్ తడబడుతోంది. 34 ఓవర్లు ముగిసేటప్పటికీ డచ్ జట్టు.. 150 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.