Kohli vs Rohit Alleged Rift: చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం చేయకండి, ట్విట్టర్ వేదికగా గంగూలిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
మీరు చెత్త రాజకీయాలు మానుకొని జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు ( Fans slam BCCI President Sourav Ganguly) చేస్తున్నారు
BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీరును టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. మీరు చెత్త రాజకీయాలు మానుకొని జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు ( Fans slam BCCI President Sourav Ganguly) చేస్తున్నారు. సమస్య విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య కాదని.. బీసీసీఐ పెద్దల స్వార్ధం వల్లే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన తర్వాత (Virat Kohli vs Rohit Sharma Alleged Rift ) వన్డే సారథిగా అతడిని తప్పించి రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించారు.
అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే సారథిగా ఉండాలన్న ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అంతేగాక.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాను కోహ్లిని అభ్యర్థించినా అతడు వినలేదని పేర్కొన్నాడు. తన మాటలను కోహ్లి పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కోహ్లి మీడియా ద్వారా గంగూలీ వ్యాఖ్యలను ఖండించాడు. తనను టీ20 కెప్టెన్సీ వదిలేయవద్దని ఎవరూ కోరలేదంటూ బీసీసీఐ తీరును విమర్శించాడు. అంతేగాక రోహిత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జై షాలను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
Fans slam BCCI President Sourav Ganguly
సిగ్గు పడండి. చెత్త రాజకీయాలతో భారత క్రికెట్‌ను నాశనం పట్టించకండి. గంగూలీ, జై షా మీరు ఎవరో ఒకరి వైపు నిలబడాలని అనుకుని ఉండవచ్చు. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కారణంగా జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కోహ్లి ఫ్యాన్స్ మాత్రం... ‘‘భాయ్ పెద్ద బాంబు పేల్చాడు.
ఎవరి మాటలు నిజమో... ఎవరు ఏమేం అబద్దాలు చెప్పారో కుండబద్దలు కొట్టాడు. ఇదిగో ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కోహ్లి, రోహిత్ మంచోళ్లే.. మీరే వీటన్నింటికి మూల కారణం’’ అని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అయితే, దాదా అభిమానులు సైతం అదే స్థాయిలో బదులిస్తున్నారు. గంగూలీ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తారని, అందుకే కోహ్లి నిర్ణయాన్ని గౌరవించారంటూ కామెంట్లు చేస్తున్నారు.