Virat Kohli Emotional: కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, పాక్‌పై గెలుపు తర్వాత భావోద్వేగానికి గురైన విరాట్, టీమ్‌మేట్స్‌ను చూసి మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదుగోండి!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు.

Credit @ Twitter

Malborne, OCT 23: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో (IND vs PAK) భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు. భారత్ మ్యాచ్ గెలవగానే, కోహ్లీ ఆనందంతో పిచ్ చుట్టూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన టీమ్‌మేట్స్ వచ్చినప్పుడు మరింత భావోద్వేగానికి గురయ్యాడు. తనను అందరూ అభినందిస్తున్నప్పుడు అతడి కళ్లు చెమర్చాయి.

ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ (Virat Kohli) 53 బంతులతో 82 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక వైపు వికెట్లు పడిపోతుంటే తను ధాటిగా ఆడుతూ ఇండియాను విజయంవైపు చేర్చాడు. మరోవైపు కోహ్లీకి హార్ధిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement