WC 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో యువకుడు మృతి, తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన

తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

Heart Attack. (Photo Credits: Pixabay)

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడు స్నేహితులతో కలిసి మ్యాచ్ చూస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. బౌలర్ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు.

విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి

ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. త్వరలో వివాహం చేయాలనుకుంటుండగా కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif