Dutee Chand: ఆ యువతినే పెళ్లి చేసుకుంటానంటున్న భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్, 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత మా పెళ్లి ఉంటుందని వెల్లడి
రిలేషన్షిప్‌లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి (married after Paris Olympics) చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది.
భారత స్టార్ మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్ తన పెళ్లికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె (Dutee Chand) మాట్లాడుతూ.. రిలేషన్షిప్‌లో ఉన్న తన భాగస్వామిని (మహిళ) 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లి (married after Paris Olympics) చేసుకుంటానని వివాదాస్పద ప్రకటన చేసింది. తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా వాపోయింది. తన లాంటి వాళ్లు ట్రాక్‌తో పాటు సమాజంతో కూడా పోరాడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. వెస్టిండీస్ దిగ్గజంతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మిస్టర్ కూల్ ధోనితో దిగిన ఫోటోలు వైరల్
భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసింది. కాగా, మరో మహిళతో (మోనాలిసా) సహజీవనం చేస్తున్న విషయాన్ని ద్యుతీ గతంలోనే ప్రకటించింది. కాగా ద్యుతీ శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణంగా ఆమెపై 2014 కామన్వెల్త్ క్రీడల్లో అనర్హత వేటు పడింది. ఐదేళ్ల న్యాయపోరాటం అనంతరం ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది.