Saikhom Mirabai Chanu: జైహింద్..పతకం తీసుకురావాలంటూ దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మీరాబాయి, చానుకు రూ.కోటి నజరానా ప్రకటించిన మణిపూర్ సీఎం
ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా దేశ వ్యాప్తంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరాబాయి తాజాగా వీడియో విడుదల చేసింది.
ఒలింపిక్స్ లో రజతం సాధించిన మణిపూర్ డైమండ్ మీరాబాయి చాను పై (Saikhom Mirabai Chanu) దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా దేశ వ్యాప్తంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరాబాయి తాజాగా వీడియో విడుదల చేసింది. జైహింద్..నన్ను అభిమానించి ప్రోత్సాహించిన భారతీయులందరికీ ధన్యవాదాలు, నేను పతకం తీసుకురావాలంటూ దేవుణ్షి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు (I am thankful to our entire nation) అంటూ వీడియోలో మీరాబాయి తెలిపింది.
తాజాగా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ భారీ నజరానా ప్రకటించారు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో రజతం గెలిచిన మీరాబాయి చానుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.1 కోటి అందించనున్నట్టు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశం జరుగుతుండగా చాను పతకం నెగ్గిందన్న సమాచారం అందిందని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన చానుకు స్వయంగా ఫోన్ చేసి వివరించారు. మిగతా రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఈ వార్త తమను ఎంతో ఆనందానికి గురిచేసిందని ఆమెకు చెప్పారు.
Here's Video
"ఇకపై నువ్వు రైల్వే స్టేషన్ల వద్ద టికెట్ కలెక్టర్ గా పనిచేయాల్సిన అవసరం లేదు... నీ కోసం ప్రత్యేక ఉద్యోగం సిద్ధం చేసి ఉంచాం. హోంమంత్రితో సమావేశం అనంతరం నిన్ను ఆశ్చర్యపరిచే అంశం వెల్లడిస్తాం" అని చానుకు వివరించారు.
చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 202 కేజీలు ఎత్తి రజతం గెలవడంతో, ఆమె ఘనత పట్ల దేశం ఉప్పొంగిపోయింది. కాగా, ఈ విభాగంలో చైనాకు చెందిన ఝి హుయి హౌ మొత్తం 210 కేజీలు ఎత్తి స్వర్ణం చేజిక్కించుకుంది. తద్వారా ఒలింపిక్ రికార్డును కూడా నమోదు చేసింది. ఇండోనేషియాకు చెందిన కాంతికా ఐసా 194 కేజీలు ఎత్తి కాంస్యం దక్కించుకుంది.