Shreyas Iyer: తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ సూపర్ సెంచరీ, అరుదైన ఘనత సాధించిన యంగ్ బ్యాట్స్ మెన్

న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టుతో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్…సత్తా చాటాడు. 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు.

Kanpur November 26: అరంగేట్రం చేసిన టెస్టులోనే సూపర్‌ సెంచరీ సాధించాడు టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్ అయ్యర్. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టుతో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్…సత్తా చాటాడు. 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు. తొలి రోజు జడేజాతో కలిసి శ్రేయస్‌ ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పగా టీమ్‌ఇండియా 258/4 స్కోర్‌తో మంచి పొజిషన్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించగా మొదట్లోనే జడ్డూ ఔటయ్యాడు.

ఇదే క్రమంలో ఫోర్లతో విరుచుకుపడిన శ్రేయస్‌ టెస్టుల్లో తొలి మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. జేమీసన్‌ వేసిన 91.1 ఓవర్‌కు రెండు పరుగులు తీసి సెంచరీ చేశాడు. అనంతరం సౌథీ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన 16వ బ్యాట్స్‌మన్‌గా, న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయ్య‌ర్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి.