Asian Kabaddi Championship: ఏషియన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ టైటిల్ భారత్ సొంతం, ఫైనల్‌లో ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇండియా
ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్ (Iran)ను చిత్తు చిత్తుగా ఓడించి గెలుపొందింది. బూసన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 42-32 తేడాతో భారత్ విజయం సాధించింది. కాగా.. ఆసియా కప్ టైటిల్ విజేతగా నిలవడం భారత్‌కు ఇది ఎనిమిదోసారి.
Busan, June 30: దక్షిణకొరియాలో జరిగిన ఏషియన్ కబడ్డీ ఛాంపియన్ షిప్ 2023 (Asian Kabaddi Championship )విజేతగా భారత్ (India) నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్ (Iran)ను చిత్తు చిత్తుగా ఓడించి గెలుపొందింది. బూసన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 42-32 తేడాతో భారత్ విజయం సాధించింది. కాగా.. ఆసియా కప్ టైటిల్ విజేతగా నిలవడం భారత్‌కు ఇది ఎనిమిదోసారి. మ్యాచ్ ఆరంభంలో భారత్ కాస్త తడబడింది. ఐదు నిమిషాల ఆట అనంతరం గొప్పగా పుంజుకుంది. పవన్, ఇనాందార్ రైడ్ పాయింట్లతో మ్యాచ్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. డిఫెండర్లు, రైడర్లు సత్తాచాటడంతో తొలి అర్థభాగం ముగిసే సరికి 23-11 తో భారత్ ఆధిక్యంలో నిలిచింది.
రెండో అర్థభాగంలో ఇరాన్ ఆటగాళ్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఓదశలో 38-31తో నిలిచాయి. ఈ దశలో భారత్ మళ్లీ పుంజుకుంది. చివరికి 42-32 తేడాతో గెలుపుబావుటా ఎగురవేసి ఆసియా కబడ్డీ ఛాంపియన్ షిప్‌ను భారత్ నిలబెట్టుకుంది. దీంతో భారత జట్టుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.