Tokyo Olympic Games 2020: కాంస్యం పైనే ఆశలు, బెల్జియంతో జరిగిన పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత్‌ ఓటమి, పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత్ ఆటగాళ్లు

టోక్యో ఓలింపిక్స్ లో ( Tokyo Olympic Games 2020) సెమీస్‎లో భారత్ పురుషుల హాకీ జట్టు, వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో సెమీ ఫైనల్లో తలపడింది. ఈ మ్యాచ్‎లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా (India Men's Hockey Team ) పరాజయం పాలైంది.

India-mens-hockey

భారత పురుషుల హాకీ జట్టు కప్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. టోక్యో ఓలింపిక్స్ లో ( Tokyo Olympic Games 2020) సెమీస్‎లో భారత్ పురుషుల హాకీ జట్టు, వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో సెమీ ఫైనల్లో తలపడింది. ఈ మ్యాచ్‎లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా (India Men's Hockey Team ) పరాజయం పాలైంది. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్‌ చేసి భారత్ సత్తాచాటింది. అనంతరం నాలుగో క్వార్టర్‎లో మూడు గోల్స్ బెల్జియం మూడు గోల్స్ చేసి ఫైనల్‎కు దూసుకుపోయింది. ఈ ఓటమితో భారత్ పసిడి ఆశలు కోల్పోయింది. కాంస్యం కోసం రెండో సెమీస్ లో ఓడిన జట్టుతో గురువారం భారత్ హాకీ పురుషుల జట్టు ఢీకొట్టనుంది.

ఓయి హాకీ స్టేడియం నార్త్‌ పిచ్‌లో మంగళవారం ఉదయం తొలి సెమీస్‌ మ్యాచ్‌ జరిగింది. మొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన భారత హాకీ టీం. తొలి క్వార్టర్‌ ఏడో నిమిషంలోనే గోల్‌ కొట్టింది. ఆపై ఫస్టాఫ్‌ ముగిసేసరికి 2-1తో లీడ్‌లో ఆశలు చిగురింపజేసింది. అయితే ఆ తర్వాత బెల్జియం దూకుడు ప్రదర్శించింది. మరో గోల్‌తో 2-2తో స్కోర్‌ సమం చేయడంతో పాటు ప్రత్యర్థి టీం డిఫెండింగ్‌ గేమ్‌ ఆడింది.

ఆస్ట్రేలియాకు షాక్..టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా హాకీ సెమీస్‌లోకి భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన

ఇక మూడో క్వార్టర్‌ నుంచి ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది. పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో భారత్‌ (Tokyo Olympics 2020 Despite Loss To Belgium) విఫలమైంది. ఒకానొక దశలో బెల్జియం అదిరిపోయే డిఫెన్స్‌ ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్‌తో స్కోర్‌ 3-2 అయ్యింది. ఆపై కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో మరో గోల్‌ సాధించి 4-2తో ఆధిక్యం కనబరిచింది.

బాధపడకండి, గెలుపోటములు సహజం, కాంస్యం కోసం పోరాడండి. హాకీ సెమీస్‌లో భారత్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

ఇక మిగిలిన టైంలో డిఫెండింగ్‌ ప్రదర్శించిన బెల్జియం.. మరో గోల్‌ చేయడంతో స్కోర్‌ 5-2గా మారింది. దీంతో బెల్జియం భారత్‌ ఓటమిని శాసించింది. ఇక టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో ఓడిన భారత హాకీ జట్టు.. కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది. రెండో సెమీఫైనల్లో జర్మనీ-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.