IPL Auction 2025 Live

Tokyo Olympics 2020: ఒట్టి చేతులతో తిరిగి రావడం చాలా బాధగా ఉంది, అయితే బాక్సింగ్ వదిలిపెట్టను, 0 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌ రింగ్‌ బరిలో ఉంటానని తెలిపిన భారత ​బాక్సర్‌ మేరీకోమ్‌

తాను పతకం గెలిచి దేశానికి రావాలనుకున్నానని, కానీ వట్టి చేతులతో తిరిగి రావడాన్ని (Mary Kom on Making Comeback ) జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అయితే తాను బాక్సింగ్‌ను మాత్రం అప్పుడే వదిలిపెట్టనని, కచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Mary Kom (Image: Mary Kom's Twitter)

New Delhi, August 1: పతకం లేకుండా స్వదేశానికి రావడం బాధగా ఉందని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పతకం గెలిచి దేశానికి రావాలనుకున్నానని, కానీ వట్టి చేతులతో తిరిగి రావడాన్ని (Mary Kom on Making Comeback ) జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అయితే తాను బాక్సింగ్‌ను మాత్రం అప్పుడే వదిలిపెట్టనని, కచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ‘పతకంతో భారత్‌లో అడుగుపెట్టాలనుకున్నా. కానీ సాధ్యం కాలేదు. బాధగా ఉంది’ అని మేరీకోమ్ పేర్కొన్నారు.

బాక్సింగ్‌ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని.. 40 ఏళ్లు వచ్చేవరకు (Can Play Till 40 ) బాక్సింగ్‌ రింగ్‌ బరిలో ఉంటానని భారత​బాక్సర్‌ మేరీకోమ్‌ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics 2020) భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్‌ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం శనివారం స్వదేశానికి చేరుకున్న మేరీకోమ్‌కు విమానాశ్రయంలో దిగిన వెంటనే మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా అని ప్రశ్నించారు.

కాంస్యంపై గురిపెట్టిన పీ.వీ. సింధు, సెమీఫైనల్లో తైజూయింగ్‌తో పోరాడి ఓడిన తెలుగమ్మాయి, ఓటమితో కాంస్యం, రజత పతకాలకు దూరమైన తెలుగు తేజం

మేరీకోమ్‌ స్పందింస్తూ.. 'టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాకపోవడం బాధను కలిగింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా. నా వరకు నేను మంచి ప్రదర్శననే చేశా. ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతలు తీరు సరిగా లేదు. తొలి రెండు రౌండ్లు గెలిచిన నేను ఎందుకు ఓడిపోతాను. బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి మీ సొంత జెర్సీని వాడకూడదు.. అని చెప్పారు. అయితే నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అదే జెర్సీ వేసుకున్నా.. అప్పుడు చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారో అర్థం కాలేదు.

కేవలం నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే జడ్జిలు అలా చేశారని అనిపిస్తుంది. ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు'' అంటూ ప్రశ్నించింది. ఇక రిటైర్మెంట్‌పై మేరీ కోమ్‌ మాట్లాడుతూ.. ''నా వయసు ఇంకా అయిపోలేదు.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా.. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది.



సంబంధిత వార్తలు