Mirabai Chanu Wins Silver: గాయాన్ని సైతం లెక్కచేయని మీరాబాయి చాను, వరల్డ్ వెయట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో సత్తాచాటిన సిల్వర్ మెడల్ సాధించిన స్టార్ వెయిట్ లిఫ్టర్, దేశ గర్విస్తోందంటూ చానుపై అభినందనల వెల్లువ
కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో (Weightlifting World Championship) సిల్వర్ మెడల్ సాధించింది (winning Silver Medal). 49 కేజీల విభాగంలో పోటీ పడ్డ చాను...మొత్తం 200 కేజీల బరువును ఎత్తింది.
New Delhi, DEC 07: ఇండియన్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) మరోసారి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటింది. కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో (Weightlifting World Championship) సిల్వర్ మెడల్ సాధించింది (winning Silver Medal). 49 కేజీల విభాగంలో పోటీ పడ్డ చాను...మొత్తం 200 కేజీల బరువును ఎత్తింది. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో 113 కేజీలను ఎత్తింది. కొంతకాలంగా మణికట్టు గాయంతో బాధపడుతున్న చాను..ఈ పోటీల్లో ఎలాంటి ఫర్మామెన్స్ చూపిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సిల్వర్ మెడల్ సాధించింది.
చైనాకు చెందిన జియాంగ్ హుహువా (Jiang Huihua) గోల్డ్ మెడల్ సాధించింది. వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో సత్తా చాటిన మీరాబాయి చానుకు కేంద్ర మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) అభినందనలు తెలిపారు. మీరాబాయి చాను మరోసారి భారత్ గర్వపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. అటు మీరాబాయి విజయంపై పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆమెను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి...ఆ తర్వాత గాయంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ పోటీల్లో సత్తా చాటి సిల్వర్ సాధించడం గర్వంగా ఉందని ఆమె కోచ్ చెప్పారు.