Paris Olympics 2024: ఇవాళ భారత్ పతకాల వేట ప్రారంభించేనా? భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే, పీవీ సింధు తొలి మ్యాచ్‌కు సిద్ధం
ఇక ఎన్నో ఆశలతో పారిస్‌కు చేరుకున్న భారత అథ్లెట్లు తొలి రోజు పలు విభాగాల్లో ఆడిన నిరాశ పర్చారు. బాక్సర్ మను బాకర్ మాత్రం చక్కటి ప్రదర్శన కనబ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Paris, July 28: పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నో ఆశలతో పారిస్‌కు చేరుకున్న భారత అథ్లెట్లు తొలి రోజు పలు విభాగాల్లో ఆడిన నిరాశ పర్చారు. బాక్సర్ మను బాకర్ మాత్రం చక్కటి ప్రదర్శన కనబ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇక భారత హీకీ జట్టు న్యూజిలాండ్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లోనే గెలిచి బోణి కొట్టింది. బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి, లక్ష్య సేను శుభారంభం చేశారు. ఇక ఇవాళ రెండో రోజు భారత్ పలు విభాగాల్లో తలపడనుంది.
యువ షూటర్ మను బాకర్ తొలి ఈవెంట్లోనే ఫైనల్‌కు చేరగా పతకం మీద ఆశలు రేపింది. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మూడో స్థానంతో ఫైనల్ రేసుకు అర్హత సాధించింది. దీంతో ఈ రెండు విభాగాల్లో భారత్ గెలిచి పతకాల వేటను ప్రారంభిస్తుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది.
ఒలింపిక్స్‌లో ఇవాళ భారత్ తలపడే వివిధ విభాగాల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
()టేబుల్ టెన్నిస్ .. విభాగంలో
మహిళల సింగిల్స్ (2వ రౌండ్): శ్రీజ అకుల vs క్రిస్టినా కల్బెర్గ్ (స్వీడన్) – 12.15 PM
మహిళల సింగిల్స్ (2వ రౌండ్): మనిక బాత్రా vs అన్నా హెర్సీ (గ్రేట్ బ్రిటన్) – 12.15 PM
పురుషుల సింగిల్స్ (2వ రౌండ్): శరత్ కమల్ vs డెన్నీ కోజుల్ ( స్లోవేనియా) – 3.00 pm
()స్విమ్మింగ్ విభాగంలో..
పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ (హీట్ 2): శ్రీహరి నటరాజ్ – మధ్యాహ్నం 3.16 గంటలకు
మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ (హీట్ 1): ధినిధి దేశింగు – మధ్యాహ్నం 3.30
()ఆర్చరీ విభాగంలో..
మహిళల జట్టు (క్వార్టర్ ఫైనల్స్): భారత్ (అంకిత భక్త, భజన్ కౌర్ మరియు దీపికా కుమారి) vs ఫ్రాన్స్/నెదర్లాండ్స్ – సాయంత్రం 5.45
మహిళల జట్టు (సెమీ ఫైనల్స్): రాత్రి 7.17
మహిళల జట్టు (పతక దశ మ్యాచ్‌లు): రాత్రి 8.18
()బ్యాడ్మింటన్ విభాగంలో..
మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): PV సింధు vs FN అబ్దుల్ రజాక్ (మాల్దీవులు), 12:50 PM
పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): HS ప్రణయ్ vs ఫాబియన్ రోత్ (జర్మనీ), 8 PM
()షూటింగ్ విభాగంలో..
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: ఎలవెనిల్ వలరివన్, మధ్యాహ్నం 12.45 గంటలకు
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత: సందీప్ సింగ్ మరియు అర్జున్ బాబుటా, మధ్యాహ్నం 2.45 గంటలకు
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్: మను భాకర్, మధ్యాహ్నం 3.30 Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం |
రోయింగ్ విభాగంలో..పురుషుల సింగిల్స్ స్కల్ (రెపిఛేజ్ 2): బల్‌రాజ్ పన్వార్, మధ్యాహ్నం 1.18,బాక్సింగ్ విభాగంలో..మహిళల 50 కేజీల తొలి రౌండ్ (నిఖత్ వర్సెస్ మ్యాక్సీ కరీన) మధ్యాహ్నం 3.50 గంటలకు మ్యాచ్ ఉండనుంది. స్విమ్మింగ్ లో పురుషుల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఫైనల్ : రాత్రి 12గంటలకు,మహిళల 100 మీటర్ల బటర్ ప్లై ఫైనల్ : రాత్రి 12.10 గంటలకు,పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్ : రాత్రి 12.50గంటలకు మ్యాచ్‌లు ఉండనున్నాయి.