Wrestlers' Protest: ఆ బీజేపీ ఎంపీ రూంకి రమ్మని లైంగికంగా వేధిస్తున్నాడు,భారత స్టార్ రెజ్లర్ సంచలన ఆరోపణలు, ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ

జ్‌భూషణ్‌తో పాటు అనేకమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు (Sexual Harassment Charges of Women Wrestlers) పాల్పడుతున్నారని ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఒలింపియన్‌ అయిన వినేశ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

Brij Bhushan Singh. (Photo- ANI)

New Delhi, Jan 19: భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూష‌ణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువెత్తాయి. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ సంచలన ఆరోపణలు చేసింది. బ్రిజ్‌భూషణ్‌తో పాటు అనేకమంది కోచ్‌లు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు (Sexual Harassment Charges of Women Wrestlers) పాల్పడుతున్నారని ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేత, ఒలింపియన్‌ అయిన వినేశ్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగ‌ట్ ఆధ్వర్యంలో బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ నిర‌స‌న ప్రద‌ర్శన కూడా చేప‌ట్టారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూష‌ణ్‌తో పాటు అనేక మంది కోచ్‌లు లైంగికంగా వేధింపుల‌కు (WFI president sexually exploited women wrestlers) పాల్పడుతున్నార‌ని వినేశ్‌ సంచలన ఆరోపణలు చేశారు.ఎన్నాళ్లుగానో సాగుతున్న వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తూ సహచర రెజ్లర్లతో కలిసి దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద వినేశ్‌ ధర్నాకు దిగింది.

అడవిలో చెట్టుకు ఉరి వేసుకున్న వర్ధమాన మహిళా క్రికెటర్, ఒడిషాలో విషాదకర ఘటన, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

ఈ ధర్నాలో ఒలింపిక్‌ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్‌, భజ్‌రంగ్‌ పూనియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతక విజేతలు సరితా మోర్‌, సంగీతా ఫొగట్‌, సత్యవర్త్‌ మాలిక్‌, జితేందర్‌, సుమిత్‌ మాలిక్‌ సహా 30 మంది టాప్‌ రెజ్లర్లు (Women Wrestlers) పాల్గొన్నారు.ఈ విషయంలో ప్రధానమంత్రి, హోం మంత్రి కలుగజేసుకొని తక్షణమే బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించాలని వీరంతా కోరారు. గతంలో తానిచ్చిన ఫిర్యాదుల కారణంగా వేధింపులు మొదలవడంతో ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని వినేశ్‌ మీడియా ముందు కంటతడి పెట్టుకుంది.

రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు

బ్రిజ్‌ భూషణ్‌ను కలవాలంటూ జాతీయ శిబిరంలోని కొంతమంది మహిళలు రెజ్లర్లను సంప్రదిస్తుంటారు. అతడితో పాటు అనేక మంది కోచ్‌లు కూడా లైంగికంగా వేధిస్తుంటారు. ఈ విషయమై గతంలో ఓసారి ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. వేధింపులకు గురైన వారిలో కనీసం పదీ పన్నెండు మంది మహిళా రెజ్లర్లు ఉన్నారు. ఇదే విషయమై మూడు నెలల క్రితం బజ్‌రంగ్‌ పూనియా, నేను హోం మంత్రి అమిత్‌ షాను కలిసి సమస్యలను వివరించాం. మీకు న్యాయం జరుగుతుందని హోం మంత్రి హామీ ఇచ్చారు’ అని వినేశ్‌ తెలిపింది.

బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ ఎంపీ అయిన 66 ఏళ్ల బ్రిజ్‌ భూషణ్‌.. 2011 నుంచి జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 ఫిబ్రవరిలో వరుసగా మూడోసారి డబ్ల్యూఎ్‌ఫఐ చీఫ్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు ఈ ఘటనను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య వివ‌ర‌ణ ఇవ్వాల‌ని (Sports Ministry Demands Explanation) కోరింది. 72 గంట‌ల్లోనే స‌మాధానం ఇవ్వాల‌ని క్రీడాశాఖ ఆదేశించింది.

ఇదిలా ఉంటే రెజ్లర్లు చేసిన ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ కొట్టిపారేశాడు. వినేశ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాననడంలో కూడా వాస్తవం లేదన్నాడు. మహిళా రెజ్లర్లలో ఒక్కరినైనా లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకుంటానన్నాడు. ‘ఇదంతా కుట్ర. ఓ పెద్ద పారిశ్రామికవేత్త వెనకుండి ఇదంతా నడిపిస్తున్నాడు. ఈసారి రెజ్లింగ్‌ సమాఖ్యలో కొత్త పాలసీ, నిబంధనలు ప్రవేశపెట్టాం. ఇవి వాళ్లకు నచ్చకపోవడంతో ఇలా ఆందోళన బాట పట్టారు’ అని బ్రిజ్‌ భూషణ్‌ అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now