Gunathilaka (Credits: ICC)

Sydney, Nov 18: రేప్ కేసులో (Rape Case) శ్రీలంక క్రికెటల్ (Srilanka Cricketer) గుణతిలక (Gunathilaka) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఆడేందుకు ఆస్ట్రేలియాకు (Australia) వెళ్లిన ఆయన... సిడ్నీలో (Sydney) అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది. సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ ఉన్న స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కోసం ఆయన గత రెండు వారాలుగా విఫల ప్రయత్నం చేయగా... చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

ఇస్రో చరిత్రలో మరో సంచలనం.. నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, రేప్ కు గురైన మహిళను కలిసిన టిండర్ యాప్ జోలికి వెళ్లకూడదని,  కేసు పూర్తయ్యేంత వరకు ఆస్ట్రేలియాను వదిలి వెళ్లకూడదని గుణతిలకు కోర్టు షరతులు విధించింది. పోలీసులకు పాస్ పోర్ట్ సరెండర్ చేయడంతో పాటు 1.50 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడించింది.