Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం.. నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్).

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం..  నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్
ISRO (Credits: PTI)

Tirupati, Nov 18: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ (Private Company) నిర్మించిన తొలి రాకెట్‌ను (Rocket) నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ (Skyroot) ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ (Vikram) సబార్టియల్ (వీకేఎస్). ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరి కోట వస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ఉనికిని పెంచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్‌డ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బరువు దాదాపు 545 కేజీలు. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోతుంది. ఈ మొత్తం ప్రయోగం 300 సెకన్లలో ముగుస్తుంది.

తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం.. జనవరి 18 నుంచి రెండో విడత అమలు

ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ మాట్లాడుతూ.. విక్రం సిరీస్ ఆర్బిటల్ క్లాస్ స్పేస్‌లాంచ్ వెహికల్స్‌లోని మెజారిటీ సాంకేతికతలను పరీక్షించేందుకు విక్రమ్-ఎస్ సాయపడుతుందని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగాన్ని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. చివరగా ఈరోజు ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.

(The above story first appeared on LatestLY on Nov 18, 2022 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).