Neeraj Chopra: 11 ఏళ్లకే 90 కేజీల బరువు, పసిడి పతక విజేత నీరజ్ చోప్రా జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రత్యేక కథనం, తమ రాష్ట్ర ఆటగాడి విజయంతో డ్యాన్స్ వేసిన హర్యానా హోం మంత్రి
దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఖండ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ దగ్గర జిమ్ లో చేర్పించారు. నీరజ్ కొన్ని కిలోలు తగ్గితే చాలని వారు కోరుకున్నారు.
వందేళ్ల కలను నిజం చేస్తూ.. భారత యువ ఆటగాడు నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics 2020) సరికొత్త చరిత్ర సృష్టించాడు. జావెలెన్ త్రోలో దేశానికి తొలి పసిడి పతకం అందించాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించిన వీరుడిగా రికార్డులకెక్కాడు. స్వతంత్ర భారత దేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం (Neeraj Chopra Wins Gold Medal) అందుకున్న హీరోగా నిలిచాడు. ఇంతకీ నీరజ్ చోప్రా ఎవరు. అతని ప్రయాణం (Neeraj Chopra’s journey) ఎలా సాగిందనే దాన్ని ఓ సారి చూద్దాం.
హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. నీరజ్ చోప్రా తండ్రి సతీష్ చోప్రా. పెరుగుతున్నప్పుడు, నీరజ్ 11 సంవత్సరాల వయస్సులో 90 కిలోల బరువుతో (chubby kid to Gold medal in Tokyo Olympics) ఊబకాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఖండ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ దగ్గర జిమ్ లో చేర్పించారు. నీరజ్ కొన్ని కిలోలు తగ్గితే చాలని వారు కోరుకున్నారు.
నీరజ్ చోప్రా మామ భీమ్ చోప్రా ఇండియా టుడేతో మాట్లాడుతూ..అతను భవిష్యత్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. అప్పట్లో మాకు కావాల్సింది అతను బరువు తగ్గడమే అని చెప్పుకొచ్చారు. అయితే అందరి అంచనాలను నిజం చేస్తూ అతను బరువు తగ్గాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు.
2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తాజాగా ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని నీరజ్ అందించాడు. 2008 ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రాకు షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం రాగా, ఈసారి నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తమ రాష్ట్ర ఆటగాడు బంగారు పతకం సాధించడంతో ఆనందం పట్టలేక డ్యాన్స్ వేశాడు.
Here's Haryana Home Minister Anil Vij Dance
మొదటి అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈ సారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో మరింత ముందుకెళ్లాడు. మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు.ఆ తర్వాత రెండు ఫౌల్స్ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు విసిరాడు. దీంతో పోటీలో పాల్గొన్న అథెట్లలో అత్యధిక మీటర్లు (87.03 మీటర్లు)విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం ముద్దాడాడు.
నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్(86.67 మీటర్లు)కు రజతం దక్కగా అదే దేశానికి చెందిన మరో అథ్లెట్ విటెడ్జ్‌స్లావ్(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్ ఒలింపిక్స్ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.