Olympics 2020: సెక్స్ చేస్తే మంచాలు విరిగిపోతాయా..ఒలింపిక్‌ గ్రామంలోని అట్టల మంచాలపై స్పందించిన ఒలింపిక్స్‌ నిర్వాహకులు, యాంటీ సెక్స్‌ బెడ్స్‌ గట్టిగా ఉంటాయని, 200 కిలోల వరకు బరువును మోయగలవని స్పష్టత

అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలంపిక్స్‌ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్లు రొమాన్స్‌ లో పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన యాంటీ సెక్స్‌ బెడ్స్‌ (Anti-Sex' Beds At Olympics) ఏర్పాటు చేశారు.

Anti-Sex Beds At Olympics (Photo-Twitter)

2020 జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు (Olympics 2020) ప్రపంచ అథ్లెట్లు రెడీ అవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలంపిక్స్‌ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్లు  రొమాన్స్‌ లో పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన యాంటీ సెక్స్‌ బెడ్స్‌ (Anti-Sex' Beds At Olympics) ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన మంచాలను క్రిడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి ఆలోచన అంటూ కొన్ని ఫోటోలతో కూడిన వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

ఈ వార్తల్ని ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఖండించారు. అట్టలతో చేసినప్పటికీ.. అవి దృఢంగానే ఉంటాయని స్పష్టం చేశారు. 200 కిలోల వరకు బరువును మోయగలవని తెలిపారు. ఆ మేరకు ముందే అన్ని రకాల సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.మరోవైపు అట్టలతో(కార్డ్‌బోర్డుతో) చేసిన మంచాలైనప్పటికీ.. దృఢంగా ఉన్నాయంటూ ఐర్లండ్‌కు చెందిన జిమ్నాస్టిక్స్ ఆటగాడు రిస్‌ మెక్‌క్లెనఘన్‌ (Irish gymnast Rhys McClenaghan) తన ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం

వాటిపై ఎగురుతూ ఆ మంచాల సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. దీనికి ఒలింపిక్స్‌ నిర్వాహకులు.. రిస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Here's (Irish gymnast Rhys McClenaghan Tweet

కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా.. శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారంటూ అమెరికాకు చెందిన ఓ ఆటగాడు ట్వీట్‌ చేయడంతో ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒలింపిక్స్ నిర్వాహకులు స్పందించి దీనిపై స్పష్టతనిచ్చారు.

Here's Anti-Sex' Beds At Olympics

ఒలింపిక్స్‌ ముగిశాక వీటిని రీసైక్లింగ్‌ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుక ఈ చర్యలు చేపట్టారు. జూలై24 న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలంపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.