Heavy Rush in Srisailam: కార్తీక మాసం క‌దా అని శ్రీ‌శైలం వెళ్తున్నారా? ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 5 కి.మీ మేర నిలిచిపోయిన వాహ‌నాలు

మల్లన్న స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసాన్ని (Kartika Masam) పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో దాదాపు 5కి.మీల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Srisailam, NOV 24: కార్తిక మాసం సందర్భంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా శ్రీశైలం ఆలయానికి (Srisailam Temple) భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసాన్ని (Kartika Masam) పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో దాదాపు 5కి.మీల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Heavy Rush in Srisailam

 

శ్రీశైలం పరిసర ప్రాంతాల నుంచి సాక్షి గణపతి, హటకేశ్వరం ముఖ ద్వారం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ఒకటో పట్టణ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.