CM Jagan at Mangalagiri: మంగళగిరి చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 14వ రోజు గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేత వైయస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. ఉప్పొంగుతున్న అభిమానంతో జననేతకు గజమాలతో స్వాగతం పలికారు. ప్రజలు అడుగడుగునా వైయస్ జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. నేడు బస్సు యాత్ర కాజా, మంగళగిరి బైపాస్ మీదగా 11 గంటలకు CK కన్వెన్షన్ వద్దకు చేరుకుంటుంది. CK కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదగా తాడేపల్లి బైపాస్ కు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్ , పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
నవరత్నాల పథకాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి..
ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి ఏమన్నారంటే.. ఒక చేనేత బిడ్డను, ఒక సాధారణమైన కుటుంబం, మధ్యతరగతి కంటే దిగువన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక సోదరిని తన ప్రభుత్వంలో పద్మశాలి కార్పొరేషన్ కు ఛైర్మన్ గా చేయడమే కాకుండా ఈరోజు చేనేత విభాగానికి సంబంధించిన ఈ మీటింగ్ ను నిర్వహించమని చెప్పినందుకు సీఎం వైయస్ జగన్ కు ధన్యవాదాలు. పార్టీ స్థాపించినరోజు నుండి జగనన్నతోనే నా ప్రయాణం సాగుతోంది. అయినా ఎప్పుడూ కూడా నా పర్సనల్ విషయాలు అన్నకు చెప్పుకోలేదు. అయినా కూడా నాకు కాళ్లు బాగాలేవన్న విషయం ఆయన తెలుసుకుని నేను ఎప్పుడు కనిపించినా నీకు కాళ్లు బాగాలేవు జాగ్రత్తగా ఉండు తల్లీ అంటారు జగనన్న. తనను నమ్ముకున్న వారికోసం ఏవిధంగా ఆలోచిస్తారో గుర్తించుకోవాలి సోదరుల్లారా, సోదరీమణుల్లారా. చేనేత వృత్తిని ఏ ప్రభుత్వమూ, ఏ నాయకుడూ గుర్తించింది లేదు. ఎందుకంటే ఏ నాయకుడికి మన మీద అవగాహన లేదు, మనస్సు లేదు. కానీ దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మనకు 50 ఏళ్లకే పెన్షన్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా జగనన్న నిలబెట్టిన పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)