Rooster Knife Attack Case: కోడి కత్తి కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు

నిందితడుకి ఏపీ హైకోర్టు (AP Highcourt) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది

2018 Kodi Kathi Case (Photo-File Image)

2018 Kodi Kathi Case: కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు 5 ఏళ్ల తరువాత బెయిల్‌ లభించింది. నిందితడుకి ఏపీ హైకోర్టు (AP Highcourt) షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది.  రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం, నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి

2018 అక్టోబర్‌ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో (Rooster Knife Attack Case) బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కొద్దిరోజుల క్రితం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.