Visakha Garjana: శాంతియుతంగా విశాఖ గర్జన సక్సెస్, భారీగా జన సందోహం, ర్యాలీకి తరలి వచ్చిన ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జేఏసీ నేతలు
విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు.
శనివారం మూడు రాజధానుల వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అధికార వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. వైజాగ్ లో అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని పేర్కొన్నారు.