Hindupur Bandh Call: నేడు హిందూపురం బంద్, జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం నేతలు బంద్‌కు పిలుపు, మద్దతు తెలిపిన MLA నందమూరి బాలకృష్ణ

కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని నిర్ణయించారు.

Hindupur (File Pic)

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పలు చోట్ల బంద్, నిరసన ప్రదర్శనలకు అఖిల పక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈరోజు హిందూపురంలో అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని నిర్ణయించారు. సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని కూడా ప్రభుత్వం నిశ్చయించింది. సత్యసాయి జిల్లా పేరు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా జిల్లా కేంద్రం విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

హిందూపురం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగిందని, దానినే జిల్లా కేంద్రాన్ని చేయాలని కోరారు. దీనిపై హిందూపురంలో నేడు అఖిలపక్షం బంద్ నిర్వహిస్తుంది. ఈ బంద్ కు మద్దతిస్తూ వ్యాపార, వాణిజ్యసముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరుతున్నారు.