AP Cabinet Reshuffle: ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై క్లారిటీ! పాత మంత్రులు జిల్లాల బాధ్యతలు, సీఎం జగన్ సంచలన నిర్ణయం, జిల్లాల వారీగా ఆశావాహులు వీళ్లే!

ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ (Cabinet) ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ (CM Jagan) డిసైడ్‌ అయ్యారు.

Vijayawada, March 11: మూడేళ్ల తర్వాత ఏపీ కేబినెట్ విస్తరణకు (Cabinet reshuffle) రంగం సిద్ధమయింది. ఏపీ కేబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువుదీరనుంది. ప్రస్తుత కేబినెట్ (Cabinet) ఏర్పడి మూడేళ్లు అవుతోంది. దీంతో సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి.. కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు సీఎం జగన్‌ (CM Jagan) డిసైడ్‌ అయ్యారు. ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తేల్చి చెప్పారు. మొత్తం మంత్రులను మారుస్తారని ప్రచారం జరిగినా.. కొందరిని కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం జగన్‌ (Cm Jagan) తెలిపారు. చాలాకాలంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ (Cabinet reshuffle) పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. అంతేగాకుండా పునర్‌ వ్యవస్థికరణలో (Cabinet reshuffle) పదవులు కోల్పోయిన వారంతా పార్టీ కోసం పని చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వారందరికి జిల్లా ఇంచార్జ్‌ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిపారు.

ఐదారుగురు మినహా మిగతా అందరిని పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరి పదవులు ఉంటాయి.. ఎవరి పదవులు ఊడతాయన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఐదాగురు మినహా మిగతా మంత్రులందర్నీ మార్చే ఛాన్స్ ఉంది. అయితే పలు జిల్లాల నుంచి కొంత మంది మంత్రి పదవులను ఆశించే ఆశావహులు ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్, బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి.

AP Cabinet Decisions: పలు బిల్లులకు కేబినెట్‌ ఆమోదం, ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు, 29న విద్యాదీవెన కార్యక్రమం, ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు పదవీ బాధ్యతలు

అనంపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy), రోజా (Roja) ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫా, మర్రి రాజశేఖర్, విడదల రజిని, అంబటి రాంబాబు(Ambati Rambabu), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్(Jogi Ramesh) ఉన్నారు.

AP Cabinet Meeting: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌, మార్చి 27 నుంచి కడప నుంచి అదనంగా మూడు విమాన సర్వీసులు, మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం

తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాం (Tammineni Seetharam)ఉన్నారు. అయితే తమ్మినేని సీతారం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif