Amarnath Yatra Tragedy: అమర్‌నాథ్ యాత్రలో పెను విషాదం, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి, 35 మంది సురక్షతంగా ఇళ్లకు..
ఈ నెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో(Amarnath Yatra Tragedy) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
Amaravati, July 11: అమర్‌నాథ్ యాత్రలో జరిగిన పెను విషాదంలో ( Amarnath cloudburst)ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో(Amarnath Yatra Tragedy) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సుధ మృతదేహాన్ని భర్త విజయ్ కిరణ్ గుర్తించారు. భౌతిక కాయాలను స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ భవన్ కమిషనర్ కౌశిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 37 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. ఇందులో 24 మంది సురక్షితంగా స్వస్థలాలకు పయనమయ్యారు. మరో 11 మంది ఏపీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న యాత్రికుల్లో 20 మంది ఆదివారం సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. విజయవాడ నుంచి వారు స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మిగతావారిని సోమవారం ఉదయం రైలులో చండీగఢ్ నుంచి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు