APSRTC Bus Catches Fire: షాకింగ్ వీడియో, ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులంతా సేఫ్, ఊపిరి పీల్చుకున్న అధికారులు

నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను( fires) గమనించిన డ్రైవర్ (Driver) అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.

APSRTC-Bus-fire (Photo-Video grab)

ఏపీలో కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సులో(Apsrtc) ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలను( fires) గమనించిన డ్రైవర్ (Driver) అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకి దిగమని చెప్పడంతో అందరూ బస్సులో నుంచి హడావుడిగా దిగారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకల్లో సీఎం జగన్, పోలీసుల తరపున గౌరవ వందనం స్వీకరించిన ఏపీ ముఖ్యమంత్రి

దీంతో పెను ప్రమాదం తప్పింది. హడావుడిలో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులను కూడా బస్సులో వదిలివేయడంతో మంటల్లోనే కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో చోటు చేసుకుంది. బస్సు విజయవాడ నుంచి గుడివాడ వెళ్తుంది. అయితే.. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Here's Video

బస్సు సాంకేతిక లోపం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.