Ex-Sarpanch Killed in Guntur: గుంటూరులో పట్టపగలే మాజీ సర్పంచ్ దారుణ హత్య, భగ్గుమన్న పాతకక్షలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల రూరల్‌ పోలీసులు

ఈ కక్షలతో పట్టపగలే మాజీ సర్పంచ్‌ దారుణ హత్యకు (Ex-Sarpanch Killed in Guntur) గురయ్యారు. ఈ దుర్ఘటన రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో (Pedanemalipuri Village) బుధవారం జరిగింది

Representative Image Murder ( Photo Credits : Pixabay

Guntur, December 10: గుంటూరులో మళ్లీ పాతకక్షలు భగ్గుమన్నాయి. ఈ కక్షలతో పట్టపగలే మాజీ సర్పంచ్‌ దారుణ హత్యకు (Ex-Sarpanch Killed in Guntur) గురయ్యారు. ఈ దుర్ఘటన రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో (Pedanemalipuri Village) బుధవారం జరిగింది. గుంటూరు పోలీసుల కథనం ప్రకారంగ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కొర్రకూటి శ్రీనివాసరావు(50) పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో పోలేరమ్మగుడి వద్ద కాపు కాసి ఉన్న కుర్రా వీరనారాయణ ఇనుపరాడ్‌తో దాడి (50-Year-Old Former Sarpanch Murdered) చేశాడు.

శ్రీనివాసరావు తలపై పలుమార్లు బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావంతో శ్రీనివాసరావు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆయనను స్థానికులు వెంటనే పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందారు. శ్రీనివాసరావు 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన భార్య వెంకాయమ్మ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఈయనకు దూరపు బంధువు వీరనారాయణతో పాతకక్షలు ఉన్నాయి.

గుడిలో నిద్ర చేయడానికి వెళ్తూ శాశ్వత నిద్రలోకి...నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం, వాగులో కొట్టుకుపోయిన ఆటో, ఐదుగురు గల్లంతు

ఈ మధ్యకాలంలో వీరనారాయణ శ్రీనివాసరావు వెన్నంటే తిరుగుతూ మంచిగా ఉంటున్నట్టు నమ్మించాడు. ఈ నేపథ్యంలోనే హత్యకు పథక రచన చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పిడుగురాళ్ల రూరల్‌ సీఐ పి.ఆంజనేయులు, ఎస్‌ఐ కె.అమీర్‌ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.



సంబంధిత వార్తలు

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif