Trans Woman Gang Rape Case: ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మంది, 50 ఏళ్ళ హిజ్రాపై గ్యాంగ్ రేప్, 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 5 గురు పరారీలో..
వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు.
Kadapa, July 22: పులివెందులలో ఓ హిజ్రాపై (50) అత్యాచారానికి పాల్పడిన కేసులో (Trans Woman Gang Rape Case) 8 మందిని అరెస్టు చేశామని, మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైయస్‌ఆర్ జిల్లా పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన కథనం ప్రకారం.. 13 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధిత హిజ్రా బుధవారం దిశ యాప్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.
పులివెందులకు చెందిన పి.చక్రధర్, కె.చలపతి, ఎ.బాలగంగిరెడ్డి, పి.గురుప్రసాద్, కె.కుమార్, ఎస్.బ్రహ్మయ్య, పి.జయచంద్రశేఖర్‌రెడ్డి, ఎం.హరికృష్ణారెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ఓ ప్రైవేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సురేంద్ర, షాకీర్, సుభాష్... ఓ పంచాయితీ కోసం సత్యసాయి జిల్లా రాగన్నగారిపల్లెకు రెండు వాహనాల్లో వెళ్లారు. తిరిగి పులివెందులకు వస్తూ కదిరి రహదారిలోని గంగమ్మగుడి దగ్గరకు చేరుకున్నారు.
అక్కడ ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి (Trans woman Gang Raped) పాల్పడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలించగా కదిరి రహదారిలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో చక్రధర్, చలపతి, బాలగంగిరెడ్డి, గురుప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయచంద్రశేఖర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి కనిపించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీన పరచుకున్నారు.