YSR Aarogyasri: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ వార్తలు అబద్ధం, సేవలు యథాతధంగా కొనసాగుతాయని తెలిపిన ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌, రూమర్స్ నమ్మవద్దని వెల్లడి

పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో హరీంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు.

YSR Aarogyasri CM YS Jagan Mohan Reddy launches Revamped YSR Arogyasri Pilot Project in Eluru (photo-Twitter)

Amaravati, May 19: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ స్సష్టం చేసింది. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో హరీంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రూ. 368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు.

ఒంగోలులో అరుదైన మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(కవాసకీ వ్యాధి)తో బాధపడుతున్న బాలుడి తల్లిదండ్రులకు సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ గురువారం రూ.లక్ష చెక్కు అందజేశారు. ఐదో విడత వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నగదు జమ కార్యక్రమానికి సీఎం జగన్‌ ఈనెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నానికి వచ్చారు.

ఆస్పత్రి బిల్లు వేయి దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుంది, 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఆ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన హృదయరంజన్, ఉషారాణి దంపతులు సీఎంను కలిసి తమ కుమారుడి అనారోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం జగన్‌ స్పందిస్తూ.. ప్రభుత్వం తరఫున తగిన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష అందించాలని అధికారులను ఆదేశించారు.