Andhra Pradesh: టీచర్ హత్యకు కారణమైన దండుపాళ్యం సినిమా, కదిరిలో ఉపాధ్యాయురాలిని దారుణంగా చంపిన కిరాతకుడు, ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు
దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని (Anantapur Police arrests accused) పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య (teacher's murder case ) జరిగింది.
Anantapur, Feb 16: అనంతపురం జిల్లాలో టీచర్ హత్య కేసు మిస్టరీ వీడింది. దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని (Anantapur Police arrests accused) పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య (teacher's murder case ) జరిగింది. సుమారు ఐదు వేల మందిని విచారించిన పోలీసులు.. కదిరికి చెందిన షఫీవుల్లాను నిందితుడిగా తేల్చారు. దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఇంతటి ఘెరానికి పాల్పడినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. ఈమేరకు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మీడియా కు వివరాలు వెల్లడించారు.
కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప దండుపాళ్యం చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితుడు షఫీవుల్లా నుంచి పోలీసులు 58 తులాల బంగారం, 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న కదిరి ఎన్జీవో కాలనీలో జరిగిన టీచర్ ఉషారాణి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలు గాలించాయి. కేసును ఛేదించేందుకు పోలీసులు లక్ష ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఐదు వేల మంది అనుమానితుల విచారించారు.