IPL Auction 2025 Live

Andhra Pradesh: చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో పోలవరానికి వేల కోట్ల నష్టం, పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు, చంద్రబాబుపై మండిపడ్డ అంబటి రాంబాబు

పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు (Chandra babu) అవివేకమే కారణమని ధ్వజమెత్తారు.

YSRCP MLA Ambati Rambabu (Photo-Facebook)

Amaravati, Sep 14: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ (YSRCP)కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అంబటి రాంబాబు (ambati-rambabu) చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు (Chandra babu) అవివేకమే కారణమని ధ్వజమెత్తారు.చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని’’ మంత్రి హితవు పలికారు.

2018కి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. నేను ముఖ్యమంత్రి అయితే తప్ప శాసన సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడు. నేను రాను అంటూనే శాసన సభ ప్రాంగణంలోకి ముర్ముకి ఓటు వేయడానికి వచ్చాడు.

దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రా చంద్రబాబు, జగన్ పాలన చూసి నీకు దిక్కు తోచడం లేదు, టీడీపీ అధినేతపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..? నీది ఒక పాలసీ...నీ పార్టీది ఒక పాలసీ ఉంటుందా?’’ అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర. అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్‌. ఆ కుంభకోణానికి పునాది వేసింది చంద్రబాబే. అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నారా?. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. మూడు ప్రాంతాల అభివృద్ధే మాకు ముఖ్యం. అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనుకోవడం తప్పా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.