Andhra Pradesh: వీడియో ఇదిగో, కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందేసిన ఒంగోలు ఏఎస్ఐ, సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపిన ఉన్నతాధికారులు

గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు.

ASI Caught Camera drinking and dancing with Villagers in Ongole

Ongole, July 2: గ్రామంలో గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందేసి చిందేసిన వీడియో వైరల్ అవుతోంది. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. వీడియోపై వెంటనే స్పందించిన ఎస్పీ.. సదరు ఏఎస్సైని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరధిలోని శంకరాపురంలో ఘటన చోటుచేసుకుందీ. పుల్లుగా మందేసి పోలీస్ స్టేషన్‌లోనే మహిళతో పనికానిచ్చిన ఏఎస్ఐ, రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న స్థానికులు, కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఘటన

శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యర్థి వర్గంపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో గ్రామంలో మరోమారు వివాదం చెలరేగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏఎస్సై వెంకటేశ్వర్లుకు డ్యూటీ వేశారు. విధినిర్వహణలో భాగంగా గ్రామానికి వచ్చిన ఏఎస్సై వెంకటేశ్వర్లు.. తను వచ్చిన పని మానేసి గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి మద్యపానం చేశాడు.

Here's Videos

మందుబాబులలో ఒకరు డ్యాన్స్ చేస్తుంటే ఈల వేస్తూ ఎంకరేజ్ చేశాడు. మరో మందుబాబు ఇదంతా తన ఫోన్ లో రికార్డు చేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియోను కొంతమంది ఉన్నతాధికారులకు పంపించారు. రోడ్డు పక్కన యూనిఫాంలోనే మందు కొడుతున్న వెంకటేశ్వర్లు నిర్వాకం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ వెంటనే స్పందించారు. ఏఎస్సై వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపించారు. దీనిపై ఐజీ ఆఫీసుకు నివేదిక పంపినట్లు అధికార వర్గాల సమాచారం.



సంబంధిత వార్తలు

Farmers Protest: కనీస మద్దతు ధరపై రైతుల పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కిసాన్ నాయకుడికి తక్షణ వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన సుప్రీంకోర్టు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ